Nirmal: ప్రమాదానికి గురైన వన్యప్రాణులను తరలిస్తోన్న వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Wild Animal Transport Lorry Overturns in Nirmal
x

Nirmal: ప్రమాదానికి గురైన వన్యప్రాణులను తరలిస్తోన్న వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Highlights

Nirmal: నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట జాతీయ రహదారిపై వన్యప్రాణు లను తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురవగా అదృష్టవశాత్తు అందులోని జీవాలన్నీ సురక్షితంగా బయటపడ్డాయి.

Nirmal: నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట జాతీయ రహదారిపై వన్యప్రాణు లను తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురవగా అదృష్టవశాత్తు అందులోని జీవాలన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. బిహార్ రాజధాని పట్నాలోని సంజయ్ గాంధీ జాతీయ జూపార్కు నుంచి వివిధ రకాల వన్యప్రాణులను రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేరట్ట జాతీయ జూపార్కుకు తరలిస్తున్నారు. వీటిలో మరియాల్ జాతి మొసళ్లు, అరుదైన తెల్లపులి ఉన్నాయి.

నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామానికి చేరుకున్నాక రెండు వాహనాల్లో ఒకటి అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలోని 8 మొసళ్లలో రెండు బయటపడగా వాటిని అధికారులు కాపాడారు. అనంతరం మరో వాహనాన్ని తెప్పించి వన్యప్రాణులను తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ జానకి షర్మిల, అటవీ అధికారులు సందర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories