Wife Dharna in Front of Husband House: లాక్‌డౌన్‌కు ముందు ఒకరితో వివాహం.. నెల వ్యవధిలోనే మరొకరితో..

Wife Dharna in Front of Husband House: లాక్‌డౌన్‌కు ముందు ఒకరితో వివాహం.. నెల వ్యవధిలోనే మరొకరితో..
x
_Wife Dharna in Front of Husband House in Bodhan
Highlights

Wife Dharna in Front of Husband House: ఓ యువకుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు పెళ్లేమో పెద్దల సమక్షంలో ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెను ఇంటి దగ్గరే ఉంచి అదే నెలలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

Wife Dharna in Front of Husband House: ఓ యువకుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. లాక్‌డౌన్ ‌కు ముందు పెళ్లేమో పెద్దల సమక్షంలో ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెను ఇంటి దగ్గరే ఉంచి అదే నెలలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటి దగ్గరే ఉంచి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు. ఆ తరువాత లాక్ డౌన్ పడడంతో రావడానికి ఎలాంటి రవాణా లేదని హైదరాబాద్‌లోనే ఇరుక్కుపోయానని చెప్పాడు. యాదాద్రిలో పెళ్లి చేసుకున్న మరో భార్యతో కలిసున్నాడు. లాక్ డౌన్ నెపంతో ఒకరి గురించి ఒకరికి తెలియకుండా చేసాడు. కానీ అతని చిత్తులు ఎన్నో రోజులు నడవలేదు ఓ ఫోన్ కాల్ అతన్ని మోసాన్ని బయటపెట్టింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివిరాల్లోకెళితే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన కిషన్, అనురాధ దంపతుల కూతురు కె.మనీషకు పట్టణంలోని హనుమాన్ టేకిడీ కాలనీకి చెందిన కలేవార్ శ్రీకాంత్‌తో ఫిబ్రవరి నెలలో వివాహం జరిగింది.

హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పెళ్లి తరువాత డ్యూటీకి హాజరు కావాలని నగరానికి వెళ్లిపోయాడు. లాక్‌డౌన్‌కు ముందు మార్చి 20న యాదాద్రిలో మంచిర్యాలకు చెందిన వనజను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే కాపురం పెట్టాడు. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ మనీషాని ఇంటి దగ్గర ఉంచి అతను హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. ఆ తరువాత అత్తగారి ఇంటి వద్ద ఉన్న మనీష.. హైదరాబాద్‌లో ఉన్న భర్తకు ఫోన్ చేయగా ఆ యువకుడి ఇంకో భార్య వనజ ఫోన్ ఎత్తి ఎవరు మీరు అని ప్రశ్నించింది. దీంతో అసలు నిజం అప్పుడు బయట పడింది.

వనజ మీరు ఎవరు అని ప్రశ్నించగా తను శ్రీకాంత్ భార్యనని తెలిపి పెళ్లికి సంబంధించిన ఫొటోలను, వీడియోను పంపించింది. ఇటు వనజ కూడా అదే విధంగా వివాహం ఫొటోలు, వీడియోలను వాట్సప్‌లో పంపించింది. అప్పుడు ఇద్దరు యువతులు తాము మోసమోయామంటూ వాపోయారు. మనీష తాను మోసపోయానని గ్రహించి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తన భర్తతో పని చేస్తున్న యువతి వనజను శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడని మనీష చెప్పింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories