Vijayashanti: రాజకీయ పార్టీల్లో విజయశాంతి ఇమడలేక పోతున్నారా..?

Why Vijayashanti Changing Party
x

Vijayashanti: రాజకీయ పార్టీల్లో విజయశాంతి ఇమడలేక పోతున్నారా..?

Highlights

Vijayashanti: పార్టీ హైకమాండ్ నుంచి హామీ వచ్చే హస్తం గూటికి చేరుతున్నారా..?

Vijayashanti: రాజకీయంగా విజయశాంతి అయోమయంలో పడ్డారా..? ఏ పార్టీలో ఉండాలో తేల్చుకోలేకపోతున్నారా? అందుకే కండువాల మీద కండువాలు మారుస్తున్నారా..? కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చి మూడేళ్లు అయిందో లేదో రాములమ్మ మళ్లీ ఘర్‌వాపసీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే ఈ ప్రచారాన్ని విజయశాంతి ఎక్కడా ఖండించకపోవడంతో.. పార్టీ మార్పు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న విజయశాంతి.. ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైంది. ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. రాములమ్మ పార్టీల మీద పార్టీలు మారుతుండటం చర్చనీయాంశంగా మారింది. తొలుత బీజేపీతో పొలిటికల్ అరంగేట్రం చేశారు విజయశాంతి. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక పార్టీ పెట్టి.. కొన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. అందులో పొసగలేక కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. అటు నుంచి బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు పయనం అయ్యారు. కమలం పార్టీలో విజయశాంతికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే ఇప్పుడు పార్టీ మారుతున్నారా లేక బీజేపీ గ్రాఫ‌్ మూడోస్థానానికి పడిపోవడం వల్ల కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని,, బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ మూడేళ్ల క్రితం కమలం తీర్థం పుచ్చుకున్నారు విజయశాంతి. కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీలో ప్రాధాన్యత లేదని, బీఆర్ఎస్‌ను ఓడించడం కషాయపార్టీ వల్ల కాదని హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంతకు కాంగ్రెస్‌లో అయినా విజయశాంతి అనుకున్న పొలిటికల్ లక్ష్యం నెరవేరుతుందా..? రాములమ్మకు ఆ పార్టీ సరైన ప్రాధాన్యత ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయశాంతి మెదక్ ఎంపీ సీటును ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి హైకమాండ్ నుంచి హామీ వచ్చిందా.. అందుకే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories