Huzurabad: హుజూరాబాద్‌ బరిలో ఆమెనా... ఆయనా?

Huzurabad: హుజూరాబాద్‌ బరిలో ఆమెనా... ఆయనా?
x

Huzurabad: హుజూరాబాద్‌ బరిలో ఆమెనా... ఆయనా?

Highlights

Huzurabad: పార్టీ ఒక్కటే గుర్తూ ఒక్కటే. అయితే ఈసారి బరిలో ఉండే వ్యక్తులు మాత్రం మారొచ్చట.

Huzurabad: పార్టీ ఒక్కటే గుర్తూ ఒక్కటే. అయితే ఈసారి బరిలో ఉండే వ్యక్తులు మాత్రం మారొచ్చట. కష్టాల్లో సుఖాల్లో రాజకీయ ఓనమాలలో అడుగులో అడుగేసిన ఆయన ఇష్టసఖి చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఏడడుగుల బంధంలో ఆరుసార్లూ ఆయనకు విజయాలు వరించి పెట్టిన ఆమె ఈసారి నేరుగా రంగంలోకి దిగాలనుకుటోందా? లేక వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? ఆయన పోటీ చేస్తే ఓ లెక్క ఆమె బరిలో ఉంటే ఇంకో లెక్క అనుకుంటున్నారా? ఇంతకీ హుజురాబాద్ బరిలో నిలిచేదెవరు? ఎవరి సర్వే ఏం చెబుతోంది? అధికార పార్టీ వ్యూహాలకు, ప్రతి వ్యూహమా లేక బరిలో నిలిచే ఉపాయమా?

ఈటల జమున. వైఫాప్ ఈటల రాజేందర్. కష్టాల్లో సుఖాల్లో రాజేందర్ వెంట నడుస్తున్నారీమే. ఇటీవల మంత్రిగా బర్తరఫ్ దగ్గర నుంచి ఈటలకు ధైర్యం నూరిపోస్తూ గో‌హెడ్ అంటూ భుజం తడుతున్నారు. అధికార పార్టీ ఎత్తులకు, లోకల్ క్యాడర్ జిత్తులకు ఈటల రాజేందర్‌ ఓ అడుగు వెనక్కి వేసినా ఉన్న ఆస్తులమ్మినా ఫర్వాలేదు కేసిఆర్‌ను ఓడించాల్సిందే అంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈటల రాజేందర్ ప్రతీ రాజకీయ నిర్ణయంలో ఆమెదే అసలు పాత్ర. ఇప్పుడిదే ఈసారి కూడా హాట్‌టాపిక్‌గా మారుతోంది.

అధికార పార్టీ తాకిడికి, ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాల ముందు ఎవరైనా దిగదుడుపే అంటారు ఎవరైనా.!! ఎన్నికలన్నా ముఖ్యంగా ఉప ఎన్నికలంటే కేసీఆర్ ఓ రేంజ్‌లో ఆడి గెలువడంలో నేర్పరి. అయినా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నంత కసి, ఆ ధైర్యం ఉన్నపళంగా ఈటల జమునకు ఎక్కడ్నుంచి వచ్చిందన్న విషయంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఓ అంచనాకు రాలేకోపోతున్నారట. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తొలి రోజు నుంచే ఆమె నియోజకవర్గంలో అడ్డా వేసి రోజుకు నాలుగైదు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఇల్లిల్లూ గడప గడప తిరిగి కొంగు చాసి మా కుటుంబాన్ని బలి చేశారంటూ సానుభూతిని ఓ రేంజ్‌లో సంపాదించగలిగారట.

సరే ఇదంతా ఎన్నికల హాడావిడిలో భాగం అనుకుందాం కాని హుజురాబాద్లో ఆమె ఇల్లిల్లూ తిరుగుతూ పోటీలోనే నేనైనా ఉండొచ్చు లేక ఆయనైనా ఉండొచ్చు గుర్తొక్కటే వ్యక్తులే వేరుగా ఉండోచ్చూ ఎవ్వరు నిలబడినా ఓటు మాత్రం మాకే అంటూ మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇంతకీ జమున పోటీ చేస్తుందా లేక రాజేందర్ పోటీ చేస్తారా అన్న కొత్త ఆలోచన మొదలైంది. అయితే జమున అలా కామెంట్ చేశారో లేదో రాజేందర్ ఓటమి భయంతోనే జమునను రంగంలోకి దింపుతున్నారన్న ప్రచారం అప్పుడే గుప్పుమంది.

అయితే, జమునకు ఈ ఉపఎన్నికల్లో తలపడేంత సీనుందా ఉన్నపళంగా నేనే రంగంలోకి దిగుతాన్న కామెంట్ పరోక్షంగా ఎందుకు చేశారు...? దీనికి ఓ లెక్క ఉందంటారు ఈటల వర్గీయులు. అదేంటంటే ఏడడుగులు నడిచిన తన అర్థాంగితో ఏడోసారి కూడా అదే పద్దతిన నామినేషన్ వేయిస్తారట. తన ఇష్ట సఖితో నామినేషన్ సెట్లు వేయించడం ఆనవాయితీ అట. హుజురాబాద్ నుంచి ఆరుసార్లు బరిలో నిలిచిన రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమున కూడా ఆరుసార్లు నామినేషన్ల వేశారు. ఆ తర్వాత విత్ డ్రా చేసుకున్నారు. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు సెట్లు వేయగా మిగతా ఐదు సార్లు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయడం ఉప సంహరించుకుంటుండమే అసలు ట్విస్ట్.

2014 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు సెట్ల నామినేషన్ వేసిన ఈటల జమున ఆ తరువాత జరిగిన ఐదు ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ వేశారు. ప్రతిసారి ఈటలతో పాటు ఆయన భార్య నామినేషన్ వేయడం సెంటిమెంట్‌గా కొనసాగుతోందని కొందరు అంటుంటే, ఈటల రాజేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే జమునను పోటిలో ఉంచే అవకాశం ఉంటుందనే ఈ ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. ఈ విషయంలో ఎవరెలా అనుకున్నా ఆ ఆలుమగల మధ్య ఉన్న ఆంతర్యం వారికే తెలియాలి తప్ప ఎవరికీ మాత్రం అంతుచిక్కడం లేదన్నది వాస్తవం. ఆరుసార్లు ఆ సెంటిమెంట్‌తోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈటల ఏడడుగులు వేసిన తన సహధర్మచారిణితో ఏడోసారీ కూడా నామినేషన్లు వేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు ఆయన వర్గీయులు.

అయితే, ఈసారి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారా లేక పరిస్థితులకనుగునంగా పోటీ చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు వేర్వేరుగా కూడా ఇద్దరి పేరిట సర్వేలు నిర్వహిస్తున్నారట. ఇద్దరికీ సర్వేల్లో మంచి ఫలితాలొస్తున్నాయట. అయితే అధికార పార్టి ఒత్తిళ్లు, ముప్పెట దాడులు, అష్ట దిగ్బంధనం పెరిగితే జమునను రంగంలోకి దింపి ఓ అబలపై ఇంత అరాచకమా అన్న వాయిస్ తీసుకురావాలన్నది ఈటెల శిబిరంలోని వాదనగా కూడా చెబుతున్నారు విశ్లేషకులు. మరి హుజూరాబాద్‌ బై పోల్‌లో ఇంకెన్ని ట్విస్ట్ ఉంటాయో చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories