రాజ్యసభకు కేకే ఖాయమైనట్టేనా.. మరి మిగిలిన ఒక రాజ్యసభ సీటు ఎవరికి?

రాజ్యసభకు కేకే ఖాయమైనట్టేనా.. మరి మిగిలిన ఒక రాజ్యసభ సీటు ఎవరికి?
x
కేకే
Highlights

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైసీపీ తరపున రాజ్యసభ రేసులో ఎవరున్నారో తేలిపోయింది. ఇక తేలాల్సింది తెలంగాణలో. ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు, గులాబీ అధినేత...

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైసీపీ తరపున రాజ్యసభ రేసులో ఎవరున్నారో తేలిపోయింది. ఇక తేలాల్సింది తెలంగాణలో. ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు, గులాబీ అధినేత ఎవరిని ఎంపిక చేస్తారన్నది హైఓల్టేజ్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. ఆశావహులు కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. మరి ఆ ఇద్దరు ఎవరు? ఆశిస్తున్నది ఎందరు?

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లబోతున్న ఇద్దరు ఎవరనేదానిపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికివారు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి రాజ్యసభకు ఇప్పటి వరకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. ఎందుకంటే ఇంకా 13 తేదీ వరకు టైం ఉంది. అయితే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ రేసులో ఉన్న కొందరు నేతలు అసెంబ్లీకి వచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి టైం ఇవ్వకపోవడంతో, మంత్రి కేటీఆర్‌ను కలుస్తున్నారు. కేటీఆర్‌ను కలిసిన నేతల్లో మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఒక రాజ్యసభ సీటు సంబంధించి, మరోసారి కేకేను రెన్యువల్ చేస్తారా లేక కొత్త వాళ్ళకు చాన్సిస్తారా అన్నది పార్టీలో ఉత్కంఠ కలిగిస్తోంది. తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కేకే కోరినట్లు తెలుస్తోంది. పార్టీకి డీఎస్‌ దూరం కావడంతో, ఢిల్లీలో కేకే లాంటి నాయకులు ఉండాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని కొందరంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రంతిప్పాలనుకుంటున్న నేపథ్యంలో, అన్ని పార్టీలతోనూ పరిచయాలున్న కేకే, హస్తినలోనే వుండాలని కొందరంటున్నారట. దీంతో కేకే సభ్యత్వాన్ని మళ్ళీ రెన్యువల్ చేయొచ్చన్న అంచనాలువినపడుతున్నాయి. కేకేకు రాజ్యసభ రెన్యువల్ చేస్తారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా కొన్ని పరిణామాలు కనపడుతున్నాయి. కేకేకు కేసీఆర్‌ నుంచి బలమైన హామి లభించిందట. నామినేషన్ పత్రాలు సిద్దం చేసుకోవాలని చెప్పారట. దీంతో ఖుషీఖషీ అయిన కేకే, తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారట.

ఒకవేళ కేకే సభ్యత్వాన్ని పునరుద్దరిస్తే, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, భవిష్యత్తేంటన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కవితను పెద్దల సభకు పంపాలంటూ పార్టీ నేతలు కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దామోదర్ రావుతో పాటు, మరో ప్రారిశ్రామిక వేత్త హెటిరో ల్యాబ్స్ ఎండీ పార్థసారధి రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అయితే రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. గతంలో కేసీఆర్‌ తనకు హామి ఇచ్చారన్న నమ్మకంతో వున్నారట పొంగులేటి. అందుకే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో, కెటిఆర్‌తో సమావేశమయ్యారట. రాజ్యసభ కోసం దరఖాస్తు చేసుకున్నానని, తనను కలిసిన విలేకరులతో చెప్పారట. తన పట్ల కేటీఆర్ సానుకూలంగా ఉన్నారని, కచ్చితంగా తనకే రాజ్యసభ టికెట్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారట. జిల్లా సమీకరణాలను పరిగణలోకి తీసుకుని, రాజ్యసభ కేటాయిస్తారని అన్నారట పొంగులేటి. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా దాదాపు పొంగులేటికే రావచ్చు అని అంటున్నారట. మొత్తానికి రెండు రాజ్యసభ బెర్తులపై సీఎం కేసీఆర్‌ మదిలో ఎవరన్నారో కానీ, ఉత్కంఠ మాత్రం అంకంతకూ పెరుగుతోంది. ఆశావహులు ఎవరికివారు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి, ఆ ఇద్దరు ఎవరన్నది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories