ఓటమితో టీఆర్‌ఎస్‌కు ఎదురయ్యే సమస్యలేంటి?

ఓటమితో టీఆర్‌ఎస్‌కు ఎదురయ్యే సమస్యలేంటి?
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ చరిత్రను తిరగరాస్తుందా? ఆరేళ్ళుగా ఎరుగని అపజయాన్ని కానుకగా ఇచ్చిందా? ఓటమి తెలియని పార్టీ ఎటువంటి గుణపాఠాలు...

దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ చరిత్రను తిరగరాస్తుందా? ఆరేళ్ళుగా ఎరుగని అపజయాన్ని కానుకగా ఇచ్చిందా? ఓటమి తెలియని పార్టీ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకుంటుంది? ఓటమితో టీఆర్‌ఎస్‌కు ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా ఎదుర్కొంటుంది..?

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఏ ఎన్నికలైనా విజయం గులాబీ దళానిదే. నల్లేరు మీద నడకలా సాగుతున్నతరుణంలో దుబ్బాకలో ఎదురుదెబ్బ తగిలింది. అంతకుముందు లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌తో పాటు టీఆర్ఎస్‌కే చెందిన మూడు సీట్లను బీజేపీకి కోల్పోయింది. ఈ అపజయం ఇంతటితో ఆగుతుందా? లేదా కొనసాగుతుందా? రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్ని గులాబీ దళం ఎలా ఎదుర్కొంటుంది?

ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు రాజకీయ భవిష్యత్‌కు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో 62వేల మెజారిటీతో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. ఈ మెజారిటీని లక్షకు పెంచుతామని ప్రకటించారు హరీష్‌రావు. తనను చూసి ఓటేయాలని దుబ్బాక కూడా తన నియోజకవర్గమేనని చెప్పారాయన. ఇలా అంతా తానే అయి హరీష్‌రావు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పర్యటించారు. మెజారిటీ తగ్గినా విజయం ఖాయం అనుకున్నారు. కాని అపజయం ఎదురైంది. దీంతో హరీష్‌కు పార్టీలో పలుకుబడి తగ్గుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అనేక ఉప ఎన్నికలను హరీష్‌రావు ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. దుబ్బాక ఆయనకు కూడా తొలి గుణపాఠం నేర్పింది. ఈ ఓటమి హరీష్‌రావుకు ఎంత ఇబ్బంది కలిగించిందో పార్టీకి కూడా అంతే ఇబ్బంది కలిగించింది. వెంటనే జరిగే గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయంపై దీని ప్రభావం చూపిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నుంచి అపజయాలు ఎదుర్కొంటున్న గులాబీదళానికి దుబ్బాక ఉప ఎన్నిక పెద్ద గుణపాఠంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories