నిన్నటి వరకు వెన్నంటే నడిచిన అనుచరగణమే వెన్నుపోటు పొడిచిందా?

నిన్నటి వరకు వెన్నంటే నడిచిన అనుచరగణమే వెన్నుపోటు పొడిచిందా?
x
Highlights

ఒంగోలు గిత్తల్లా తలపడ్డారు. బాహుబలి, భళ్లాలదేవ రేంజ్‌లో కత్తి తిప్పారు. దమ్ము చూపిస్తానంటూ ఒకనేత, దుమ్ము దులిపేస్తానంటూ మరో నేత తొడగొట్టారు. కానీ...

ఒంగోలు గిత్తల్లా తలపడ్డారు. బాహుబలి, భళ్లాలదేవ రేంజ్‌లో కత్తి తిప్పారు. దమ్ము చూపిస్తానంటూ ఒకనేత, దుమ్ము దులిపేస్తానంటూ మరో నేత తొడగొట్టారు. కానీ గెలుస్తాను, గెలిచేశాను అంటూ అరిచేసిన నాయకుడికీ మాత్రం పరాజయం తప్పలేదు. ప్రత్యర్థి బలమే కాదు, తన బలహీనతలు కూడా ఆయన కొంపముంచాయి. నా అనుకున్నవాళ్లే, చివరికి నట్టేట ముంచారని కుమిలిపోతున్నాడు ఆ నాయకుడు.ప్రకాశం జిల్లా చీరాల. ఏపీలో చిన్న బొంబాయి. మగువల మనసు దోచుకునే వస్త్రాల కాణాచి. రాష్ట్రం మొత్తంలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన నియోజకవర్గాల్లో ఒకటి చీరాల. ఎందుకంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఒంగోలు గిత్తల్లా హోరాహోరీగా తలపడిన నాయకులు మామూలోళ్లు కాదు. బాహుబలి, భళ్లాలదేవ లాంటి ఉద్దండులు ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం ఇద్దరూ ఒక రేంజ్‌లో ఫైట్ చేశారు. చివరి వరకూ నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు. చివరికి విజయం కరణం బలరాంను వరిస్తే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ పరాజయం పాలయ్యారు. మరి కరణంను విజయం ఎలా వరించింది పార్టీ మారినా ఆమంచిని పరాజయం ఎలా పడగొట్టింది? చీరాల నియోజవర్గంలో పదిహేనేళ్ళుగా తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రోశయ్య ప్రియశిష్యుడుగా పేరుతెచ్చుకున్న ఆమంచి, జెడ్పీటిసి, ఆ తర్వాత కాంగ్రెస్ తరుపున ఎమ్ఎల్ఎగా, మరోసారి ఇండిపెండెట్ అభ్యర్ధిగా గెలిచి నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. చీరాలలో ఆమంచి చెప్పిందే వేదం, చేసిందే శాసనం.

చీరాలలో సరైన నాయకుడు లేకపోవడంతో తన మాటకు తిరుగేలేకుండా పోయింది ఆమంచికి. అందుకే ఇక్కడ ప్రతిసారి వార్ వన్ సైడ్‌గానే సాగింది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం, వార్‌ వన్‌ సైడ్‌ కాదు, టఫ్‌ ఫైట్‌ అని ముందే తేలిపోయింది. ఎందుకంటే, టీడీపీ నుంచి వైసీపీకి ఆమంచి మారడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. ప్రకాశంలో మరో తిరుగులేని నాయకుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం రంగంలోకి దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌కు దీటైన అభ్యర్థిగా బరిలోకి దింపింది టీడీపీ. దీంతో చీరాల సమరం కురుక్షేత్రంగా మారింది. కానీ బలరాం చేతిలో ఆమంచికి ఓటమి తప్పలేదు. అయితే ఆమంచి ఓటమికి ప్రత్యర్థి బలం కంటే, సొంతవర్గం గోతులు తవ్వడమే కారణమన్న చర్చ వినిపిస్తోంది.

నమ్మిన వారే నట్టేట ముంచారా నిన్నటి వరకు వెన్నంటే నడిచిన అనుచరగణమే వెన్నుపోటు పొడిచిందామితిమీరిన దూకుడు కొంపముంచిందా వీటన్నింటికీ సమాధానం అవునన్నది చీరాలలలో సాగుతున్న చర్చ. టీడీపీకి రాజీనామా చేసి, సరిగ్గా ఎన్నికల టైంలో వైసీపీలో చేరారు ఆమంచి కృష్ణమోహన్. దీంతో ఆమంచి గెలుపుకు తిరుగులేదని అందరూ భావించారు. జగన్‌ ఊపు, ఆమంచి అనుచరగణం, చేసిన పనులు, ఇలా తాను ఓడిపోయే ఛాన్సేలేదని లెక్కలేశారు ఆమంచి. అయితే టీడీపీ నుంచి కరణం బలరాం బరిలోకి దిగడంతో ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. అప్పటి వరకు ఆమంచికి అండగా ఉన్న ఒక్కొక్కరూ దూరమవడం ప్రారంభించారు. పోతుల సునీత, పాలేటి రామారావు, బాలాజీ ఇలా కీలక నేతలు కరణంతో చేతులు కలిపారు. ఆమంచి అనుచరవర్గాన్ని చీల్చారు కరణం. స్థానిక వ్యతిరేకతకు తోడు కరణం బలరాం హవా ముందు నిలువలేకపోయారు ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి ఓటమికి స్థానిక వ్యతిరేకతే కాదు, సొంతవర్గం చెదిరిపోవడమూ ఫలితాన్ని మార్చింది.నియోజకవర్గంలో గెలుపుకోసం కరణం బలరాం వ్యూహత్మకంగా అడుగులేశారు. క్షేత్రస్ధాయిలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేశారు. తాను స్ధానికుడనని, ప్రజలకు

అండగా వుంటాననే భరోసా ఇస్తూ ముందుకెళ్ళారు. ఆమంచి అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే, తనను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ఇలా చీరాలలో ఆమంచి అష్టదిక్కులనూ దిగ్బంధనం చేసి, పైచేయి సాధించారు కరణం. రాష్ట్రం మొత్తం జగన్‌ హవా వీచినా చీరాలలో మాత్రం, తెలుగుదేశం గాలి వీచింది. అప్పటకప్పుడు ఆమంచి పార్టీ మారడం, అప్పటికే స్థానికంగా ప్రబలంగా వ్యతిరేకత ఉండటంతో జనానికి కూడా, కరణం బలరాం తప్ప మరో ఛాయిస్ లేకుండాపోయింది. మొత్తానికి తనకు తిరుగులేదు, ఎదురేలేదనుకున్న ఆమంచిని, చీరాల జనం మాత్రం పక్కనపెట్టారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఆమంచి ఓడిపోయిన బాధకన్నా, కరణం గెలిచినందుకు వైసీపీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే, కరణం ఏ పార్టీ తరపున గెలిస్తే, ఆ పార్టీ అధికారంలోకి రాదన్నది సెంటిమెంట్‌. అందుకే కరణం గెలిచినా, టీడీపీ అధికారంలోకి రాలేదు, వైసీపీ పవర్‌లోకి వచ్చిందని సంతోషపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఎవరి యాంగిల్‌ వారిదే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories