Revanth Reddy: 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తాం.. రేషన్‌కార్డులు లేని 6 లక్షల మంది రైతులకు..

We Will Complete the Crop Loan Waiver in 3 Installments Says CM Revanth Reddy
x

Revanth Reddy: 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తాం.. రేషన్‌కార్డులు లేని 6 లక్షల మంది రైతులకు..

Highlights

Revanth Reddy: రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్.

Revanth Reddy: రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. మొత్తం మూడు దఫాలుగా రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు రేవంత్. రేపు లక్ష వరకు, ఈ నెలాఖరులోగా లక్షన్నర, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు వేదికల్లో సంబరాలపై హస్తం నేతలు చర్చించారు. రేపు లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతగా 7 వేల కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారాయన. నెలాఖరులోగా లక్షన్నర వరకు.. ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే.. కష్టమైనా రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రేపటి నుంచి జరగబోయే రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాల వరకు చెప్పుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు రేవంత్. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ 28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ ధ్వజమెత్తారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి లబ్దిదారులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేషన్‌కార్డులు లేని 6 లక్షల మంది అన్నదాతల రుణాలను మాఫీ చేస్తామన్నారు. పెద్ద ఎత్తున రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ కార్యకర్త రుణమాఫీ గురించి ప్రచారం చేయాలని భట్టి పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories