TS News: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్

Water War Between Congress And BRS
x

TS News: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ 

Highlights

TS News: కాంగ్రెస్ వల్లే పంటలు ఎండిపోయాయంటున్న కేసీఆర్

TS News: వంద రోజులలో అన్ని చేశామని కాంగ్రెస్ అబద్దాలు చెబుతుందని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేట జిల్లా లో ఎస్సారెస్పీ కాల్వలు ఉన్నాయి...ఈ కాల్వలకు కాళేశ్వరం జలాలను లింక్ చేశారు...అయితే కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది.. అయితే ఆరోపణల పేరుతో కాంగ్రెస్ రైతులకు‌నష్టం చేస్తుందని కేసీఆర్ అంటున్నారు. ఎస్సారెస్పీ కాల్వలకు సాగు నీరు ఇవ్వక పోవడం వల్ల పంటలు ఎండాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంగతుర్తి సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు.. తాను పర్యటనకు వస్తున్నాను అని తెలిసి...కాల్వలకు సాగు నీరు ఇచ్చారని..ఇదే నీరు నెల రోజుల నుంచి ఇస్తే పంటలు ఎండిపోయేవి కావని కేసీఆర్ ఆరోపించారు.

తొమ్మిదిన్నర సంవత్సరాలు నాగార్జున సాగర్ నుంచి నీళ్లిచ్చామని, ...నాగార్జున సాగర్ లో నీళ్లున్నా ఆయకట్టు కు నీరివ్వలేదని ...వరిపొలాలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ విమర్శించారు కేసీఆర్. జిల్లా లో ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదని ...కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ చేసిన విమర్శ ఇపుడు రాజకీయం గా కలకలం రేపుతుంది. సాగునీటి వివరాలు ,ప్రాజెక్టుల్లో నీరు..వర్షపాతం పై కేసీఆర్ అంకెలతో సహా వివరించడం కాంగ్రెస్ పార్టీని డైలామాలో పడేసిందని అంటున్నారు..

మరోవైపు కేసీఆర్ నల్గొండ పర్యటన కామెంట్స్ పై కాంగ్రెస్ నుంచి ఘాటైన విమర్శ వస్తుంది...దక్షిణ తెలంగాణ ను ప్రధానంగా నల్గొండ జిల్లా ను ఎడారి గా మార్చిందే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...ఇరిగేషన్ సెక్టార్ ను సర్వ నాశనం చేసి దోపిడీ చేసి తెలంగాణ ను నాశనం చేసిందే కేసీఆర్ అంటూ ...ఉత్తమ్ విమర్శలు.చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories