Public-Facing Problems with Damaged Roads: రోడ్డెక్కాలంటేనే జంకుతున్న జనం

Public-Facing Problems with Damaged Roads: రోడ్డెక్కాలంటేనే జంకుతున్న జనం
x
Highlights

Public Facing Problems with Damaged Roads: పేరుకే పేద్ద నగరం కానీ జనం పడరాని అవస్థలతో అల్లాడిపోతున్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు ప్రజలు...

Public Facing Problems with Damaged Roads: పేరుకే పేద్ద నగరం కానీ జనం పడరాని అవస్థలతో అల్లాడిపోతున్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడిపోతున్నారు. గతుకులతో నిండిన రహదారులపై వెళ్లాంటే ఒళ్లు హునమైపోతుందని వాహన చోదకులు హడలిపోతున్నారు. ప్రతి నెల వాహనాలు మెకానిక్‌ల వద్దకు వెళ్తుంటే బండ్లు నడిపే వారు మాత్రం దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. వరంగల్ కార్పోరేషన్‌లో చిన్న వర్షానికే రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. దీంతో నగర వాసులు, వాహనదారులు రోడ్డుపైకి రావలంటేనే జంకుతున్నారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలియక ప్రమాదాల బారీన పడుతున్నారు. చాలా కాలనీలల్లో పరిస్థితి ఇలాగే ఉందని వాహనదారులు వాపోతున్నారు.

అధికారుల అసమర్థత, నాయకల నిర్లక్ష్యంతో నగర రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయని స్థానికులు విమర్శిస్తున్నారు. వాహనాలు రోడ్డు మీద నడపాలంటే ప్రాణలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతుకుల రోడ్డుతో వాహనాలు ప్రతినెల రిపేర్‌ చేయించాల్సి వస్తోందని వాహనదాలు చెబుతున్నారు. వాహనం ఏదైనా సరే ఒకటిరెండు కిలోమీటర్లు ప్రయాణించేసరికి ఒళ్లు హూనమైపోతుందని వాపోతున్నారు. ఏళ్లు గడుస్తున్నా రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామన్న పాలకుల హామీలు నీటిమీది రాతల్లానే మిగిలిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైన స్పందించి కార్పోరేషన్‌ అధికారులు సమన్వయంతో రోడ్లును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories