వరంగల్‌లో ఫలించిన రైతుల పోరుబాట

Warangal ORR Land Pooling
x

వరంగల్‌లో ఫలించిన రైతుల పోరుబాట

Highlights

Warangal: వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ నిలిపివేతకు ప్రభుత్వం నిర్ణయం

Warangal: ఓరుగల్లులో రైతు ఉద్యమం ఉధృంతంగా సాగుతోంది. ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా రైతులు పోరుబాట పట్టి ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కూడా ల్యాండ్ పూలింగ్ ను ఆపేస్తున్నట్లు ప్రకంచినా..అన్నదాతల ఆందోళన మాత్రం ఆగడం లేదు. జీఓ 80ఏ ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు.

వరంగల్ భూసేకరణ అంశం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోంది. జనగామ జిల్లాలోని మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకారాలు సేకరించేందుకు సిద్ధమైంది. దీంతో ఆయా గ్రామాలు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి పోరుబాట పట్టారు. వరంగల్ జిల్లాలోని 15గ్రామాలు, హన్మకొండలోని 10, జనగామలోని 3 గ్రామాల్లోని భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చారు. అయితే రైతుల ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ల్యాండ్ పూలింగ్ జీవోను తాత్కాలికంగా ఆపింది ప్రభుత్వం.

ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఇంతకాలం గ్రామాల్లో నిరసలు వ్యక్తం చేసిన రైతులు గత వారం రోజులుగా రోడ్డెక్కారు. కరుణాపురం-నష్కల్ మధ్య జాతీయరహదారి దిగ్బంధం నిర్వహించడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. రైతులకు మద్దతుగా వామపక్షాలు ఉద్యమంలో కలసి వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉద్యమానికి మద్దతు ప్రకటించగా..తీన్మార్ మల్లన్న రైతుల కోసం వచ్చి అరెస్టయ్యారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో శాశ్వతంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ జీఓను రద్దు చేయాలని, అంతవరకు ఆందోళనలు విరమించేది లేదని రైతు ఐక్యకరణ కమిటీ స్పష్టం చేసింది.

ల్యాండ్ పూలింగ్ ను నిలిపివేస్తున్నట్లు కుడా చైర్మన్ ప్రకటించినప్పటికీ..ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైస్ చైర్మెన్ ప్రావీణ్య రెడ్డి ప్రకటించారు. అయితే రైతులు మాత్రం జీఓను రద్దు చేసేంత వరకు తమ పోరు కొనసాగించాలని డిసైడయ్యారు. పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి ఇంటిని ముట్టడించిన రైతులు.. ఆ తర్వాత వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ను అడ్డుకున్నారు. రైతులకు ఇష్టం లేకుండా వారి భూములను తీసుకునే ప్రసక్తే లేదని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. ఏదేమైనా ల్యాండ్ పూలింగ్ పేరుతో చేపట్టిన భూసేకరణ అధికార పార్టీకి, కర్షకుల నుండి గట్టి షాక్ నే ఇచ్చిందని చెప్పాలి. జీఓ రద్దు విషయంలో మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం ఉంటుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories