Warangal Mayor Tested For Corona Positive: కరోనా బారిన పడ్డ వరంగల్ మేయర్ దంపతులు...

Warangal Mayor Tested For Corona Positive: కరోనా బారిన పడ్డ వరంగల్ మేయర్ దంపతులు...
x
Warangal Mayor And His Wife Tested For Corona Positive:
Highlights

Warangal Mayor And His Wife Tested For Corona Positive: రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ బారిన రాష్ట్రంలోని ఎంతో మంది అధికారులకు, నాయకులు, వైద్యులు పడ్డారు.

Warangal Mayor And His Wife Tested For Corona Positive: రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ బారిన రాష్ట్రంలోని ఎంతో మంది అధికారులకు, నాయకులు, వైద్యులు పడ్డారు. ఇప్పుడు తాజాగా వరంగల్ మేయర్‌ను తాకింది. నాయకులు, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి ఏ మూల నుంచి వస్తుందో తెలియక అంతా కలవరపడుతున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ సహా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.ఇక ఈ మేయర్ దంపతులకు కరోనా రావడం స్థానికంగా అలజడి రేపుతోంది. దీంతో నగరంలో ఉండే మేయర్‌ స్నేహితులు, రాజకీయ నేతల్లో ఆందోళన నెలకొంది.

ఇక వీరిద్దరికీ కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు అప్రమత్తమై మేయర్ దంపతులతో పాటు, గన్‌మెన్‌, ఇతర సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అంతే కాక గత పదిరోజులుగా మేయర్‌ను కలిసిన వారు, వారి సన్నిహితంగా మెలిగిన నేతలు, కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు వారికి సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక మేయర్ దంపతులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇకపోతే నిన్న తెలంగాణలో 1284 కేసులు నమోదయ్యాయి. వాటితో జీహెచ్ఎంసీ పరిధిలో 806, మేడ్చల్‌లో 86, సంగారెడ్డిలో 20, రంగారెడ్డిలో 91, ఖమ్మం 18, కామారెడ్డి 31, వరంగల్ అర్బన్ 51, యదాద్రి భువనగిరి 11, మేహబూబాబాద్ 11, పెద్దపల్లి 35, మెదక్ 23, మహబూబ్ నగర్ 19, మంచిర్యాల 15, కొత్తగుడెం 01, జయశంకర్ భుపలపలి 02, నల్గొండ 35, సిరసిల్ల 27, ఆసిఫాబాద్ 11, వికారాబాద్ 17, నగర్ కర్నూల్ 23, జనగాం 10, నారాయణపేట 14, నిజామాబాద్ 11, ములుగు 01, వనపర్తి 02, సిద్దిపేట 08, సూర్యాపేట 20, గద్వాల్ 02, కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 43,780కి చేరింది. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories