కేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం

War of Words Between State Govt and Central Govt Over Irrigation Projects
x

కేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం

Highlights

CM KCR: కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు

CM KCR: కేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మళ్లీ ప్రారంభం అయ్యింది. బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే.. కేంద్ర మంత్రులు తెలంగాణలోని ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోందని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వాడుకోడానికి నీటి వనరులు ఉన్నా.. కేంద్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శలు గుప్పించారు. ఇక కేంద్ర ప్రభుత్వ పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని, సభలతోనైనా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని గతం నుంచి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని, తెలంగాణ సర్కార్ కూడా అందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టిందని తెలియజేసింది. ఇక ఇప్పుడు ప్రాజెక్టుకి అనుమతులు లేవని కేంద్ర మంత్రి ఆరోపణలు చేయడం, ఇక లక్షల కోట్ల అవినీతి జరిగిందని అనడం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తుంది.

జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తున్నారనే.. బీజేపీకి కడుపు మండుతోందని కేంద్రాన్ని విమర్శించారు మంత్రి హరీశ్ రావు అప్పట్లో ప్రాజెక్టును పొగిడిన నోళ్లే.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన నిజాలను ఇప్పుడు అబద్ధాలు అంటున్నారని చెప్పారు. చట్టసభలను కేంద్రమంత్రి షేకావత్ అవమానించారన్నారు హరీశ్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories