నిజామాబాద్‌లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

War Of Words Between BJP And BRS In Nizamabad
x

నిజామాబాద్‌లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

Highlights

Nizamabad: అరెస్ట్ చేస్తామని సూర్యనారాయణకు పోలీసుల నోటీసులు

Nizamabad: నిజామాబాద్‌ అర్బన్‌లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌లో అభివృద్ధిపై ఎమ్మెల్యే గణేష్ గుప్తా చర్చకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఛాలెంజ్‌ను బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ స్వీకరించారు. కంటేశ్వర్ నిలకంటేశ్వర ఆలయానికి చర్చకు వస్తానన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సూర్యనారాయణ ఇంటికి వచ్చిన పోలీసులు.. అనుమతి లేదంటూ.. చర్చకు వెళ్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు నోటీసులు అందించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బహిరంగ చర్చకు అనుమతి లేదంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories