War between TRS and BJP : మాధవుడి జోరును బండి అందుకునేనా?

War between TRS and BJP :  మాధవుడి జోరును బండి అందుకునేనా?
x
Highlights

War between TRS and BJP: ఆయన వస్తాడు. నిప్పులు కురిపిస్తాడు. జోష్‌ నింపి వెళతాడు. మంటలు మండుతుంటాయి. కానీ ఆ ఫైర్‌ను ఒలింపిక్‌ జ్యోతిలా పట్టుకుని ఊరేగడంలో, గతంలో నేతలు ఫెయిలయ్యారట.

ఆయన వస్తాడు. నిప్పులు కురిపిస్తాడు. జోష్‌ నింపి వెళతాడు. మంటలు మండుతుంటాయి. కానీ ఆ ఫైర్‌ను ఒలింపిక్‌ జ్యోతిలా పట్టుకుని ఊరేగడంలో, గతంలో నేతలు ఫెయిలయ్యారట. ఆరిపోయిన తర్వాత మళ్లీమళ్లీ వచ్చి, ఆయన మాటల అగ్గి రగిలిస్తూనే వుంటారు. కానీ వాటిని వెలుగులుగా మార్చి, పార్టీని తేజోమయం చెయ్యడంలో ఎందుకనో, పాత నాయకత్వం మసకబారిందట. ఇప్పుడు న్యూ లీడర్‌‌షిప్‌ వచ్చింది. మళ్లీ ఆయన ఫైరింగ్‌ డైలాగులు పేల్చాడు. మరి కొత్త నాయకత్వం కాగడాగా ఎలుగెత్తుతుందా? అధికారపక్షం కురిపించే విమర్శల జడివానకు చప్పుున ఆరిపోయేలా చేస్తుందా?

రాంమాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఫైర్‌ బ్రాండ్‌ లీడర్. ట్రబుల్ షూటర్‌గా జాతీయస్థాయిలోనూ పేరుంది. అంతకుమించి వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే కామెంట్లు, కోల్డ్‌ బ్లడ్డెడ్‌ స్ట్రాటజీలతో పొలిటికల్‌ వెదర్‌నే మార్చి, ప్రకంపనలు సృష్టిస్తారన్న నేమూ వుంది మాధవ్‌కు. రాంమాధవ్, ఎక్కడ అడుగుపెడితే, అక్కడ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధిష్టానం సైతం నమ్ముతుంది. జమ్మూకాశ్మీర్‌ విభజనకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి భారీ సంఖ్యలో సీట్లు రావడంలో, సంకీర్ణ సర్కారు కొలువుదీరడంలో రాంమాధవ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోనూ ఐదు పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగిస్తే, మూడింటిలో కాషాయ జెండా ఎగిరింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా మూడు స్థానాల విజయంతో, రాంమాధవ్‌ వ్యూహం ఇక్కడ పక్కాగా వర్కౌటవుతుందని పార్టీ పెద్దలు కాన్ఫిడెన్స్‌తో వున్నారట. అయితే, ప్రతీసారి తెలంగాణ రాజకీయాలపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయి, రాంమాధవ్ జోష్ నింపితే, దాన్ని కంటిన్యూ చెయ్యడంలో గత నాయకత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాంమాధవ్ ఫైరింగ్ స్పీచ్‌ జోష్‌ను, కొత్త నాయకత్వమైనా ఏ మేరకు జనంలోకి తీసుకెళ్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

రాంమాధవ్ తీరే వేరు. ఆయన తెలంగాణకు వచ్చిన ప్రతిసారి పార్టీ కార్యకర్తలు నిరాశపడకుండా ప్రసంగాలు చేస్తారని నేతలే మాట్లాడుకుంటారు. ఏ పార్టీపై ఆరోపణలు చేస్తే, సొంత పార్టీ క్యాడర్, ఉత్సాహపడతారో ఆపార్టీపై చెలరేగిపోయి స్పీచ్‌ ఇస్తారట. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి అధికార టిఆర్ఎస్‌పై కాకరేపే విమర్శలు, ఆరోపణలు చేసి హీట్‌ పుట్టిస్తారు. పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ పర్యటనలో కార్యకర్తల మీటింగ్‌లో మాట్లాడిన మాధవ్, కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని గులాబీదళంపై మంటల్లాంటి మాటలు కురిపించారు. తాజాగా పార్టీ వర్చువల్‌ ర్యాలీల్లో భాగంగా తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి, మరోసారి టీఆర్ఎస్‌ను గిచ్చిరేపెట్టుకునేలా మాట్లాడారు మాధవ్.

అయితే ప్రతిసారి రాంమాధవ్ ఇలాంటి వాఖ్యలు చేయడం, టిఆర్ఎస్ ఎదురుదాడి చేయడం, రాజకీయ దుమారం రేగడం ఎప్పడూ జరిగేదే. కానీ రాష్ట్ర బీజేపీ ఈ పొలిటికల్‌ హీట్‌ను కొనసాగించడంలో విఫలమయ్యేదనే చర్చ పార్టీలో ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా, టిఆర్ఎస్ కు ధీటూగా సమాధానం ఇవ్వడంలో, రాష్ట్ర పార్టీ విఫలమయ్యిందనే మాటలు వినపడ్డాయి. కానీ ఈసారి గతానికి భిన్నంగా పరిస్థితి ఉందన్న మాటలూ వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ రాష్ట్ర పగ్గాలు తీసుకున్న నాటి నుంచి, రాంమాధవ్‌ ధోరణినే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈసారి కూడా రాంమాధవ్‌తో పాటు సంజయ్ సైతం టిఆర్ఎస్‌పై విరుచుకుపడుతూ, తన ప్రసంగంలో మసాలా వుండేలా మరోసారి చూసుకున్నారు. అయితే, ఈ హీట్‌ కంటిన్యూ చేేసేందుకు ఏం చెయ్యబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

రాంమాధవ్‌ కామెంట్ల తర్వాత, టీఆర్ఎస్‌ సైతం దీటుగానే తిప్పికొట్టింది. కరోనాతో పాటు నిధుల విడుదలపైనా కాషాయ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. మొన్నీమధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం విమర్శలు చెయ్యడంతో, వెంటనే వరుసబెట్టి గులాబీ నేతలు చెలరేగిపోయారు. ఇలా కాకరేపే కామెంట్లతో తెలంగాణలో చర్చనీయాంశంగా మారి, బలమైన ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలనుకుంటున్నట్టు, బీజేపీ వ్యూహాలను బట్టి అర్థమవుతోంది. తాజాగా వర్చువల్ ర్యాలీలో రాంమాధవ్‌ స్పీచ్‌ను కూడా అదే కోణంలో చూడాల్సి వుందన్నది విశ్లేషకుల మాట. అయితే రానున్న కాలంలో గులాబీ-కమలం నేతల మధ్య మాటల యుద్ధం మరింత వాడివేడిగా సాగుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories