TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్ల కలకలం

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్ల కలకలం
x

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్ల కలకలం

Highlights

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు పోస్టర్లు వెలిశాయి. పీసీసీ అధ్యక్షుడి ఫోటో పై పోస్టర్లు అంటించారు. నాంపల్లిలోని TGPSC, హైదర్‌గూడలోని తెలుగు అకాడమీల ముందు పోస్టర్లు వెలిశాయి. తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని... ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని TGPSC ఎందుకంటూ పోస్టర్లు అంటించారు.

అలాగే టీజీపీఎస్సీ ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లను ఎవరు అంటించారోనని ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories