Lockdown: కరోనా సెకండ్ వేవ్ భయంతో పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Some Villages are Imposing Self lockdown Due to the Fear of Corona Second Wave
x

గ్రామాలలో స్వచంద లాక్ డౌన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Lockdown: ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెల్ప్‌ లాక్‌డౌన్ విధించారు.

Lockdown: కరోనా సెకండ్ వేవ్ భయంతో పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరండ్ల గ్రామంలో సెల్ప్‌ లాక్‌డౌన్ విధించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామ సర్పంచ్ సూచనల మేరకు పంచాయతీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెల్ప్‌ లాక్‌డౌన్ విధించారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులందరూ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు సర్పంచ్‌ త్రివేణి. కరోనా ప్రబలకుండా శానిటైజేషన్ చేస్తున్నామని.. ప్రతి వార్డులో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories