హైదరాబాద్‌లో వాన బీభత్సం : మట్టిలో కూరుకుపోయిన కార్లు, బైకులు, లారీలు

హైదరాబాద్‌లో వాన బీభత్సం : మట్టిలో కూరుకుపోయిన కార్లు, బైకులు, లారీలు
x
Highlights

హైదరాబాద్‌లో పెద్ద వర్షం కురిసింది. గత వందేళ్లలో చాలా పెద్ద వాన ఇదేననంటున్నారు. ఈ వానకు ప్రజల అవస్థలు అన్ని ఇన్నీ కావు.. కాలనీలు, బస్తీల్లో ఎటు చూసి వరద నీటిలో మునిగిపోయాయి.

హైదరాబాద్‌లో పెద్ద వర్షం కురిసింది. గత వందేళ్లలో చాలా పెద్ద వాన ఇదేననంటున్నారు. ఈ వానకు ప్రజల అవస్థలు అన్ని ఇన్నీ కావు.. కాలనీలు, బస్తీల్లో ఎటు చూసి వరద నీటిలో మునిగిపోయాయి. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, రోడ్డుపక్కన ఉన్న వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. కార్లు, బైకులు, లారీలు, పెద్ద పెద్ద కంటైనర్లు అనే తేడా అన్ని ఒక్కటై.. నీటిలోనే మునిగాయి. వరద తగ్గిన తర్వాత తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. వరద నీరు తగ్గుతున్నా కొద్ది మట్టిలో కూరుకున్న వాహనాలు బయట పడుతున్నాయి.

వరద నీటిలో మునిగిన వాహనాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మట్టి తవ్వుతున్న కొద్ది వాహనాలు బయటపడుతున్నాయి. వాహనాలపై ఉన్న నెంబర్ ఆధారంగా గుర్తించి.. యజమానులకు అప్పగిస్తున్నారు. వరదలో చిక్కిపోయిన వాహనాలపై బురద పేరుకుపోయింది. వరదలో ఎక్కువ సేపు ఉండడంతో.. ఇంజీన్‌లోకి నీరు పోయి.. బురద పేరుకుపోయిందని గ్యారేజీకి తీసుకుపోతే.. అవి ఇక దేనికి పనికి రావంటున్నారు.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం ఎలా ఉందో చెప్పడానికి ఈ వాహనాలు ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పల్లె చెరువు కట్ట తెగి దిగువకు ప్రవహించడంతో మైలార్ దేవ్‌పల్లి పరిసరాలు, బండ్లగూడ ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రి గడిపారు.. తమ వాహనాలు అక్కడే వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. దాదాపు చాలా వాహనాలు పూర్తిగా దెబ్బతిని స్క్రాప్‌కు కూడా పనికి రాకుండా పోయాయి. ఈ వాహనాలు హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories