Lockdown Effect: నగరంలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు..

Lockdown Effect: నగరంలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు..
x
vegetables rate hiked in Telangana
Highlights

విజృంభిస్తున్నకరోనా వైరస్ ను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వ తేది వరకు లాక్‌ డౌన్ విధించింది.

విజృంభిస్తున్నకరోనా వైరస్ ను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వ తేది వరకు లాక్‌ డౌన్ విధించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న చిరు వ్యాపారులు నిత్యావసర ధరలను అమాంతం పెంచేసారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెరుగుతుండడంతో సామాన్య ప్రజానీకం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా రైతు బజార్లలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటనను చేసిన తరువాత రోజు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం హైదరాబాద్‌లోని కొత్తపేట, వనస్థలిపురం, హబ్సీగూడ, ఎర్రగడ్డ, మెహదీపట్నం రైతు బజార్ల ముందు, కిరాణా షాపుల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. దీంతో షాపులు, రైతుల బజారులు, పెట్రోల్‌ బంకులు, పండ్ల, పూల మార్కెట్లు అన్నీ రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ ఒక్క సారిగా వస్తువుల కోసం బయటికి రావడంతో ప్రధాన రహదారులు కూడా వాహనాల రద్దీతో కిటకిట లాడాయి.

ఇక పట్టణ దారులంతా ఒక్క సారిగా షాపుల ముందు క్యూ కట్టడంతో వ్యాపారస్తులు అమాంతం ధరలను పెంచేశారు. దీంతో కోనుగోలు దారులు ఎందుకింతలా ధరలు పెంచేసారని ప్రశ్నించగా ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి కావడం లేదని, చుట్టుపక్కన పల్లెల నుంచి రైతులు కూరగాయలు తీసుకురావడం లేదని సమాధానం తెలిపారు.

కూరగాయల ధరల పట్టిక

మిర్చి కిలో రూ.100

టొమాటోలు కిలో రూ.50,

క్యారెట్లు కిలో రూ.50,

బెండకాయలు కిలో రూ.60,

దోసకాయ కిలో రూ.60,

దొండకాయలు కిలో రూ.60కి కిలో

పాలకూర, తోటకూర ఒక కట్ట రూ.10

Show Full Article
Print Article
More On
Next Story
More Stories