రోజు రోజుకు ఆకాశాన్నంటుంతున్న కూరగాయల ధరలు

రోజు రోజుకు ఆకాశాన్నంటుంతున్న కూరగాయల ధరలు
x
Highlights

కూరగాయాల ధరలు రోజు రోజుకు మండి పోతున్నాయి. ఓ వైపు కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు పెరిగిన కూరగాయల ధరలు వణుకు పుట్టిస్తున్నాయి.

కూరగాయాల ధరలు రోజు రోజుకు మండి పోతున్నాయి. ఓ వైపు కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు పెరిగిన కూరగాయల ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. కేవలం బయట మార్కెట్లోనే కాదు రైతు బజార్లోలనూ కూరగాయల ధరలు కొండెక్కాయి. మరో వైపు ఉల్లి ధర సైతం అమాంతం పెరిగి వినియోగదారులకు కంటనీరు పెట్టిస్తుంది. పెరిగిన ధరలతో దళారులు సైతం క్యాష్ చేసుకుంటున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలోనూ అందరికి అందుబాటులో ఉన్న కూరగాయలు ధరలు ప్రస్తుతం ఆకాశాన్నింటాయి. మొన్నటి వరకు కిలో 50 రూపాయల వరకు ఉన్న వంకాయ, చిక్కుడు, క్యారెట్, కాకర, బీర వంటి కూరగాయలు ఇప్పుడు 80 నుంచి 90 రూపాయలవరకు పెరిగింది. కూరగాయలు కొందామని మార్కెట్ వెళ్లిన సామాన్యులు పెరిగిన ధరలతో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేకపోతున్నామని ఇంట్లో పచ్చడితో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. మరో వైపు మార్కెట్ అధికారులు నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంటలను దెబ్బతీశాయని ఉత్పత్తితో పాటు దిగుమతులు తగ్గిపోయాయని చెబుతున్నారు.

హైదరాబాద్ సిటీలోని రైతు బజార్లతో పాటు గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి మార్కెట్లలోనూ ధరలు మండిపోతున్నాయని నగరవాసులు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories