కొత్త ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికి : ఉత్తమ్

కొత్త ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికి : ఉత్తమ్
x
uttam kumar reddy(File photo)
Highlights

కరోనాపై, ఇరిగేషన్‌పై, వ్యవసాయంపై అంతర్జాతీయ నిపుణులు కేసీఆరే అని చెప్పుకుంటున్నారని తెలంగాణ పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

కరోనాపై, ఇరిగేషన్‌పై, వ్యవసాయంపై అంతర్జాతీయ నిపుణులు కేసీఆరే అని చెప్పుకుంటున్నారని తెలంగాణ పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ చేపట్టాలన్నారు. జూన్‌ 2వ తేదీన మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రాజెక్టుల వద్ద ఒక రోజు దీక్ష చేపట్టాలి ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ లక్ష కోట్లు ఖర్చుచేశారన్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికే అని ఆయన అన్నారు.

లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. తరతరాలను ఇందుకోసం తాకట్టు పెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు. మీడియాను తన అహంకారపు వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్‌ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు మాట్లాడేందుకు వెళ్లినా అదే విధంగా చేస్తారని ఆయన అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితం ఇచ్చాని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం అక్కడ డబ్బులు ఖర్చు పెడితే కమిషన్‌ తక్కువ వస్తుందని ఆలోచిస్తున్నారని అన్నారు. అందువల్లే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరేళ్ల తర్వాత కూడా పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు వందశాతం పూర్తి కాలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories