Gram Panchayat: నిధులివ్వండి.. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌ల పడిగాపులు

Unreleased Funds To Gram Panchayats
x

Gram Panchayat: నిధులివ్వండి.. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌ల పడిగాపులు 

Highlights

Gram Panchayat: ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్

Gram Panchayat: తెలంగాణలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. గ్రామాల్లో లక్షలాది రూపాయలతో సర్పంచ్‌లు పనులు చేశారు. సంవత్సరాలు గడిచినా సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు రాలేదు. ఇప్పుడు సర్పంచ్‌ పదవి లేదు.. తమ పెండింగ్ బిల్లులు వస్తాయా రావా అన్న టెన్షన్ మాజీలైన సర్పంచ్‌ల్లో నెలకొంది.

కొమరం భీమ్ జిల్లాలో గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పదవీలో ఉన్నప్పుడే బిల్లుల కోసం ట్రెజరీల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పే నేతలు గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు అందించడం లేదు.

గ్రామ పంచాయతీల నిర్వహణకు స్టేట్ కార్పొరేషన్ నిధులు ఇంకా రిలీజ్ కాలేదు. ఎస్‌ఎఫ్‌సీ నిధులు 11 నెలలుగా నుంచి రావడంలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే 14వ ఆర్థిక సంవత్సర నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఎప్పటికప్పుడు నిధులు అందించి గ్రామాల ఆభివృద్ధికి దోహదపడాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిధులు నిలిపి వేయడంతో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదవీ కాలం ముగిసిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మాజీ సర్పంచులు వాపోతున్నారు.

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి. గ్రామాల్లో ఈ నిధులతో ఆభివృద్ధి పనులు చేపడుతారు. గతేడాది నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో గ్రామాల్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ ఈఎంఐ, ట్రాక్టర్‌లో డీజిల్‌, కరెంట్‌ బిల్లులు, మురికి కాలువల శుభ్రత, వీధిలైట్లు, వాటర్‌పైపులైన్‌ల లీకేజీలు, రోడ్ల శుభ్రత తప్పక చేయాల్సినవి కావడంతో సర్పంచులు కొందరు సొంత డబ్బులతో చేపట్టారు.

మరికొందరు అప్పు చేసి ఖర్చు చేశారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా సర్పంచులకు కోట్లలో బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పనులు చేసిన వెంటనే నిధులు ఇవ్వాల్సి ఉంది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా బకాయిల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. బిల్లులు అందక అప్పుల్లో కూరుకుపోయామని... వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచులు డిమాండ్ కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories