Kishan Reddy: వీలైతే సేవ చేయండి లేదంటే సలహాలివ్వండి- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy Inspects Bollaram Cantonment Hospital Over Covid Treatment
x

మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Kishan Reddy: బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు.

Kishan Reddy: బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఊహించని కోవిడ్ ఉత్పాతం నుంచి బయటపడటానికి త్రివిధ దళాలు, పరమిలాటరీలో రిటైర్డ్ అయిన వైద్య సిబ్బందిని వినియోగించనున్నాం. యువతకి 15 రోజులు శిక్షణ ఇచ్చి వారిని కోవిడ్ కోసం ఉపయోగించుకొనున్నాం. వైద్యవిద్యనభ్యశిస్తున్న వారందరి సేవలు ఉపయోగించుకొని భవిష్యత్ లో తీసుకొనే ఉద్యోగాలలో వెయిటేజ్ యిస్తాం అని తెలిపారు.

దేశంలో 49 వేలు మాత్రమే ఉన్న వెంటిలేటర్స్ ను, ఈ 9 నెలల్లో 51 వేలు అదనంగా తయారుచేసి వినియోగిస్తున్నాం. దేశంలో ఆర్మీ ఆసుపత్రి, రైల్వే ఆసుపత్రి, ఎయిమ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని అన్ని ఆసుపత్రులను ప్రజల కోసం కోవిడ్ ఆస్పత్రులుగా సేవలందిస్తున్నాం. నేడే డిఫెన్స్ మినిష్టర్ రాజ్ నాధ్, డిఫెన్స్ సెక్రెటరితో మాట్లాడి నిధులు సమకూర్చి కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి సేవలు అందేలా చేస్తా అన్నారు. వీలైతే సేవ చేయండి సలహాలు ఇవ్వండి,కానీ పనిచేసే ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసి అడ్డంకులు సృష్టించొద్దు. ప్రజల సహకారం లేనిదే కోవిడ్ చైన్ ను బ్రేక్ చేయనిదే ఈ మహమ్మరిని అరికట్టలేం అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories