Kishan Reddy: ఆ ఎమ్మెల్యేలు చేరితే బీజేపీకి వచ్చే లాభం ఏమిటి..?

Union Minister Kisan Reddy Fire on TRS | TS News
x

Kishan Reddy: ఆ ఎమ్మెల్యేలు చేరితే బీజేపీకి వచ్చే లాభం ఏమిటి..?

Highlights

Kishan Reddy: ప్రభుత్వం పడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా..?

Kishan Reddy: మొయినాబాద్ ఫామ్‎హౌస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమి తప్పదనే టీఆర్‌ఎస్‌ డ్రామాలని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రులను చేసింది టీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఫామ్‎హౌస్ కుట్రకు స్క్రిప్టు, డైరెక్షన్, యాక్షన్ అంతా ప్రగతి భవన్ కేంద్రంగానే జరిగిందన్నారు.

12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించిన కిషన్‎రెడ్డి సీఎం కుర్చీ చేజారిపోతోందని కల్వకుంట్ల కుటుంబానికి భయం పట్టుకుందన్నారు. అధికారం పోతే అక్రమాలపై దర్యాప్తు జరుగుతుందనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని కిషన్‎రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో చేరమని కేటీఆర్‌.. బీజేపీ నేతలను ఫోన్‎లో అడగడం నైతికతనా..? అది పోలీస్‌లకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories