Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందంటానికి అదే నిదర్శనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Union Minister Bandi Sanjay Sensational Comments On KTR
x

Bandi Sanjay: కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితికి కారణం

Highlights

Bandi Sanjay: కేటీఆర్‌ ట్వీట్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కౌంటరిచ్చారు.

Bandi Sanjay: కేటీఆర్‌ ట్వీట్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఇప్పటి పరిస్థితికి కేటీఆర్‌ అహంకారమే కారణమని సంచలన కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదని...అసలు దోస్తీ.. కాంగ్రెస్‌, కేసీఆర్‌ మధ్యే ఉందన్నారు. వీరి మధ్య స్నేహం లేకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దోస్తానంటే ఫోన్లలో మాట్లాడుకుంటారు తప్ప మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వరన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణలు ఏమయ్యాయని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. హర్యానా, కశ్మీర్ ఎన్నికల్లో కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి డబ్బు పంపింది వాస్తవం కాదా కేటీఆర్?. డబ్బుల సంచులతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడ్డది వాస్తవమా కాదా కేటీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్న రిపోర్టు ప్రకారం కనీసం కేసీఆర్‌కు 41 సీఆర్‌పీసీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. ఆ రెండూ కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి అనే దానికి నిదర్శనం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి కేసులపై విచారణ జరపకపోవడమే అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి అని రేవంత్ రెడ్డి సర్కారుకు సవాల్ విసిరారు. సీబీఐ ద్వారా విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయంటూ కామెంట్స్‌ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ తనని కలిసిన సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories