Amit Shah: జాతీయ జెండా ఆవిష్కరించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా

Union Home Minister Amit Shah Hoist the National Flag in Parade Ground
x

Amit Shah: జాతీయ జెండా ఆవిష్కరించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా

Highlights

Amit Shah: పటేల్‌ విగ్రహానికి అమిత్‌షా నివాళులు

Amit Shah: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన వేడుకలను బీజేపీ అట్టహాసంగా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు పరేడ్‌గ్రౌండ్‌ సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు ముఖ్య అథితిగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు.

విమోచన వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరవుతుండగా...కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై మాత్రం.. ఆ రాష్ట్ర వేడుకల్లో పాల్గొనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. విమోచన ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి హోంశాఖ మంత్రి అమిత్‌షా నిన్న రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాసేపట్లో పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. తొలుత సైనిక అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జాతీయజెండాను ఎగురవేస్తారు.

విమోచన వేడుకల్లో భాగంగా నిజాం అకృత్యాలను కళ్లకు కట్టేలా థీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వెయ్యి ఉరుల మర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరు సాగించిన రాంజీ గోండు అనుచరుల్లో వెయ్యిమందిని నిర్మల్‌లోని ఒక మర్రి చెట్టుకు ఉరి తీశారు. నిజాం అరాచకాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ సాహసానికి సంబంధించిన పోటో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేశారు.

తెలంగాణ విమోచన వేడుకల్లో CISF​, CRPF​, RAF తో పాటు మొత్తం 7 కేంద్ర బలగాలు కవాతును నిర్వహించనున్నాయి. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో 8 ట్రూపులు తెలంగాణకు చెందినవి కాగా.. రెండు మహారాష్ట్ర, మరో రెండు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ట్రూపులున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విమోచన వేడుకలకు సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ సైతం పూర్తయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories