TS News: సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’.. కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్

Union Govt announced September 17thwill be celebrated as Hyderabad Liberation Day
x

TS News: సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’.. కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్

Highlights

TS News: సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలన్న కేంద్రం

TS News: నిజాం రాజుపై సైనిక చర్య చేపట్టి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన రోజైన సెప్టెంబర్‌ 17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డే నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ లిబరేషన్‌ డేను పురస్కరించుకుని ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో తెలిపింది.

భారతదేశం స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం 13 నెలలపాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్యతో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినం నిర్వహించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Show Full Article
Print Article
Next Story
More Stories