TS: గొర్రెల పంపిణీ స్కాం.. పరారీలో ఇద్దరు కీలక నిందితులు

Two Sheep Scam Accused Abroad
x

TS: గొర్రెల పంపిణీ స్కాం.. పరారీలో ఇద్దరు కీలక నిందితులు

Highlights

TS: గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

TS: తెలంగాణలో సంచలనం రేపిన గొర్రెల స్కాం కేసులో ఏసీబీ తన దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ సూత్రదారులను గుర్తించే పనిలో పడింది. ఉన్నతాధికారులు ,కాంట్రాక్టర్ల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుంది. ఇద్దరు కీలక నిందితులు విదేశాలకు పారిపోయినట్టు గుర్తించారు. సయ్యద్ మొహియుద్దీన్ అతడి కొడుకు ఇక్రం సూత్రదారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ కేసు నమోదుకు ముందే విదేశాలకు పారిపోయిన ఇద్దరు నిందితులు..సాక్షులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏసీబీ కి ఫిర్యాదులు అందాయి.

ఇప్పటికే నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది, వీరిలో మేడ్చల్ పశుసంవర్దక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య, కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్‌లు ఉన్నారు.

గొర్రెల పంపిణీలో 2.10 కోట్లు కొట్టేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేట్ వ్యక్తుల పేరుతో బినామీ అకౌంట్లను ఓపెన్ చేసి నిధులు మళ్లించారు. అయితే ఈ వ్యవహారమంతా మొహియుద్దీన్,అతడి కుమారుడు ఇక్రం కనుసన్నల్లోనే జరిగినట్టుగా గుర్తించారు. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories