ములుగు అడవుల్లో అలజడి!

ములుగు అడవుల్లో అలజడి!
x
Highlights

ములుగు జిల్లాలోని అడవుల్లో తుపాకుల మోత దద్దరిల్లింది. జిల్లాలోని మంగపేట మండలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది....

ములుగు జిల్లాలోని అడవుల్లో తుపాకుల మోత దద్దరిల్లింది. జిల్లాలోని మంగపేట మండలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. రామచంద్రునిపేట అడవుల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతులు ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు. ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఇక పోతే టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన సమయం నుంచి పోలీసులు ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఎక్కడ అనుమానితులు కనిపించినా వారి గురించి ఎక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు.

ఇక పోతే కొద్ది రోజుల క్రితమే కుమ్రంభీమ్ జిల్లా కదంబ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ అలజడి సృష్టించింది. అప్పుడు కూడా పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు సుక్కాలు, బాజీరావు ప్రాణాలు విడిచారు. కుమ్రంబీమ్, మంచిర్యాల జిల్లాల కార్యదర్శి భాస్కర్, కమిటీ సభ్యులు వర్గీస్, రాము, అనిత త్రుటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోలను పట్టుకునేందుకు పోలీసులు సీరియస్ గా యత్నిస్తున్నారు. ఇరవై గ్రేహౌండ్స్ పార్టీలు, ‌మరో 5వందల స్థానిక పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా బెజ్జూర్‌, కాగజ్‌నగర్‌, చింతల మానేపల్లి, సిర్పూర్ యూ, దహేగామ్ మండలాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు అన్వేషిస్తున్నారు. దీంతో కాగజ్ నగర్ డివిజన్ పోలీసు బూట్ల చప్పుళ్లతో దద్ధరిల్లుతోంది. ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో మావోలు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచి మావోలు చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర పారిపోయే అవకాశాలున్నాయని పోలీసుల అంచనా. అయితే వారి కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల నిఘా పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories