Telangana: ఎలుకలు తిన్న కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి

Two Children Died After Eating Poison Food in Peddapalli
x

Telangana: ఎలుకలు తిన్న కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి

Highlights

Telangana: పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఎలుకల కోసం పెట్టిన మందు రెండు నిండు ప్రాణాలను బలిగొంది.

Telangana: పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఎలుకల కోసం పెట్టిన మందు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అంతర్గాం మండలంలోని విస్సంపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాహారం తిన్న వీరిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దారబోయిన శ్రీశైలం-గుణావతి దంపతులు ఇంట్లో ఎలుకల కోసం మందు పెట్టగా ఎలుకలు మందుతోపాటు కర్జూజ తిన్నాయి.

ఆ కర్జూజను కుటుంబంలోని అయిదుగురు తిన్నారు. దీంతో అస్వస్థతకు కుటుంబ సభ్యులు గురికాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు దారబోయిన శివానంద్(10), శరణ్ మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories