ఆనంద్ రెడ్డి మర్డర్ కేసులో ట్విస్ట్

ఆనంద్ రెడ్డి మర్డర్ కేసులో ట్విస్ట్
x
Highlights

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైనా ఆనంద్ రెడ్డి కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆనంద్‌రెడ్డితో పాటు అతని సోదారుడిని కూడా హత్య...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైనా ఆనంద్ రెడ్డి కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆనంద్‌రెడ్డితో పాటు అతని సోదారుడిని కూడా హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ప్రథకం ప్రకారమే అడవిలో టెంట్ వేసి పార్టీ చేసినట్టు సీన్ క్రీయేట్ చేశాడు ప్రదీప్ రెడ్డి. పార్టీ చేసుకునేందుకు ఆనంద్ రెడ్డిని తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.

అంతకుముందు భూమి ఉందని చూసేందుకు రావాలని ఆనంద్‌రెడ్డితో సోదరుడికి ఫోన్ చేయించాడు ప్రదీప్ రెడ్డి. అయితే ఆనంద్‌రెడ్డి అడవిలో ఉన్నందుకు సిగ్నల్ లేకపోవడంతో ఫోన్ కలవలేదు దీంతో అడవిలోనే చాలాసేపు వెయిట్ చేసి తిరిగి వెళ్లిపోయాడు.

ఈ నెల 7న అదృశ్యం అయిన ఖమ్మం లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి విషాదంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొళ్ల బుద్దారం అడవిలో దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి అని పోలీసులు కన్ఫం చేశారు. ప్రస్తుతం ప్రదీప్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని తెలుస్తోంది.

డబ్బులు ఇస్తానని ఆనంద్ రెడ్డిని నమ్మించి కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గొళ్లబుద్దారం అడవిలో పడేశారు. దీంతో క్లూస్ టీం, పోస్ట్‌మార్టం టీం తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీ ఉన్న స్థలంలోనే ఆనంద్ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. క్లూస్ టీంతో అడవిలోకి ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులు సోదరుడు వెళ్లారు. పంచనామా చేసిన తర్వాత ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంపగించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories