TSRTC: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి సజ్జనార్ మరో గుడ్‌న్యూస్

TSRTC to Run 3,500 Special Buses
x

TSRTC: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి సజ్జనార్ మరో గుడ్‌న్యూస్

Highlights

TSRTC: గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌ మహానగరంలోని బస్టాప్స్‌, రైల్వే స్టేషన్లు కిట కిటలాడాయి.

TSRTC: గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌ మహానగరంలోని బస్టాప్స్‌, రైల్వే స్టేషన్లు కిట కిటలాడాయి. సంక్రాంతి పండుగ సందర్బంగా హైదరాబాద్‌‌లో నివసించే వారిలో చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అయితే ఈ రోజుతో సంక్రాంతి పండుగా పూర్తికావడంతో సొంత గ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్‌ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఇవాళ్టి నుంచి మళ్లీ తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే ఏర్పాట్లు చేస్తున్నాయి. 110 రైళ్లను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక ఇటు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లిన వారి కోసం ఏకంగా 3500 స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్‌. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories