టీఎస్‌ ఆర్టీసీ పార్సిల్స్‌, కొరియర్‌, కార్గో సేవలు ప్రారంభం

టీఎస్‌ ఆర్టీసీ పార్సిల్స్‌, కొరియర్‌, కార్గో సేవలు ప్రారంభం
x
Highlights

ఒకప్పుడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాంటే రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అన్ని మారుమూల ప్రాంతాల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది.

ఒకప్పుడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాంటే రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అన్ని మారుమూల ప్రాంతాల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ-కామర్స్‌ సంస్థలకు మరింత నమ్మకంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ రణాశాఖ కార్యాలయంలో ఆర్టీసీ పార్సిల్స్‌, కొరియర్‌, కార్గో సేవలను శుక్రవారం ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, పీసీసీ ప్రత్యేక అధికారి ఎస్‌ కృష్ణకాంత్‌తో కలిసి ప్రారంభించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులు కొరియర్‌ సేవలను, చిన్నపాటి కవర్లతోపాటు పార్సిల్స్‌ ని సులభంగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఉండేటట్లు మొబైల్‌ అప్లికేషన్‌ను సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. చార్జీల వివరాలతో కూడిన ఓ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్సిల్‌, కొరియర్‌, కార్గో సేవలు ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకే పీసీసీ (పార్సిల్‌, కొరియర్‌, కార్గో) సేవలను విస్తృతం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే ఆర్టీసీ ఆర్థికంగా బలపడేందుకు ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నట్టు చెప్పారు. తొలిదశలో 104 కార్గో బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయని, అన్ని బస్‌స్టేషన్లలో సంస్థ ఉద్యోగులతో ఈ పీసీసీ సెంటర్లు నిర్వహిస్తున్నామని, 140 బస్‌స్టేషన్లలో పార్సిల్‌ సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. లాక్‌డౌన్‌ అనంతరం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గననీయంగా తగ్గిందని దీంతో ఆదాయం కూడా చాలా వరకు తగ్గిపోయిందని, దాన్ని భర్తీ చేసుకోవడానికే ఈప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, అధికారులు పాల్గొన్నారు.

ఇక ఈ-కామర్స్‌ సేవలను ఈ విధంగా పొందవచ్చును.

కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ కామర్స్ సేవల్లో భాగంగా రాష్ట్ర పరిధిలో కొరియర్‌ సేవలకు కిలో వరకు రూ.118, 500 గ్రాములకు రూ.93, 250 గ్రాముల వరకు రూ.68 వసూలు చేయనున్నారు. అదే విధంగా అంతర్రాష్ట్ర రవాణాకు రూ.75, రూ.100, రూ.125 వసూలు చేయనున్నారు.

ఆహార పదార్థాలను సరఫరా చేయాలనుకుంటే పూర్తిగా ఆహార పదార్థాల రవాణాకు బరువు ఆధారంగా చార్జీతోపాటు హమాలీ, సిబ్బంది చార్జీలను కూడా వసూలు చేస్తారు.

50 కిలోల ఒక పార్సిల్‌ను 180 కిలోమీటర్ల మేర రవాణాకు రూ.165, ఆరు పార్సిల్స్‌గా ఉంటే రూ.882-రూ.908 వరకు వసూలు చేస్తారు. ఆహార పదార్ధాలైతే అదనంగా రూ.60 చార్జి చేస్తారు.

ఇక దూర ప్రాంతాలను నుంచి సరుకులను ఇతర ప్రాంతాలకు పంపించాలనుకుంటే ఏసీ బస్సుల్లోని డిక్కీలను నెలవారీ ప్రాతిపదికన కూడా కేటాయిస్తారు. దీనికి సంబంధించిన చార్జీల విషయానికొస్తే రోజూవారీ బుకింగ్‌ కోసం కిలోమీటర్‌కు రూ.5 చొప్పున నిర్ణయించారు. అంతే కాక నెలవారీగా డిక్కీలను పొందేందుకు నెల రోజులకు సంబంధించిన డబ్బును పూచీకత్తుగా జమచేయాలి. రాత్రి వేళ కిలోమీటరుకు కనీస చార్జీ రూ.3, పగటి పూట కనిష్ఠంగా రూ. 2 చొప్పున వసూలు చేస్తారు.

బల్క్‌ కొరియర్స్‌ సరఫరా కోసం ప్రతి టన్నుకు వంద కిలోమీటర్ల వరకు రూ.824 వసూలుచేస్తారు.

అదే విధంగా కార్గోలో సేవలను పొందాలనుకునే వారు కార్గో బస్సుల్లో కిలోమీటరు, బరువు ఆధారంగా చార్జిలను నిర్ణయించారు. కనిష్ఠంగా 75 కిలోల బరువున్న వస్తువులు పది కిలోమీటర్ల మేర రవాణాకు రూ.50 నుంచి మొదలవ్వనున్నాయి. గరిష్ఠంగా చూసుకుంటే క్వింటాలు బరువున్న వాటిని వెయ్యి కిలోమీటర్ల మేర రవాణాకు రూ.445గా టారిఫ్‌ రూపొందించారు. అంతే కాక వాటికి అదనంగా ఇన్సూరెన్స్‌, హమాలీ, సిబ్బంది, ఇతర చార్జీలను కూడా జోడిస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories