TSRTC: దసరా పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీకి రూ.8కోట్ల ఆదాయం

TSRTC Earned Rs 8 Crore During Dussehra From 11 10 2021 to 17 10 2021
x

దసరా పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీకి రూ.8కోట్ల ఆదాయం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

TSRTC: నష్టాల్లో ఉన్న టీఎస్‌ఆర్టీసీ కి ఈ ఏడాది దసరా పండుగ కాసుల వర్షం కురిపించింది. ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ 8కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఎనిమిది రోజుల్లో మొత్తం 8కోట్ల 54లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా 4 నుంచి 5 కోట్ల ఆదాయం టార్గెట్‌ పెట్టుకున్న ఆర్టీసీ అధికారులకు అదనంగా 3కోట్ల రూపాయల ఆదాయం రావడంతో సంతోష పడుతున్నారు.

కోవిడ్‌ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న ఆర్టీసీకి దసరా ఆదాయం కొంతమేరకు ఉపశమనం కల్పించిందని చెప్పవచ్చు. ఇక పండుగకు ఐదు రోజుల ముందే స్పెషల్‌ బస్సులపై అదనపు చార్జీలు వసూలు చేయకపోవడం, అటు పది రోజుల్లోనే 2కోట్లకుపైగా మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్‌, సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసీని లాభాల బాటలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories