TSRTC cargo services: కార్గో సర్వీసుల బుకింగ్స్‌ కోసం ప్రత్యేక ఏజెన్సీలు

TSRTC cargo services: కార్గో సర్వీసుల బుకింగ్స్‌ కోసం ప్రత్యేక ఏజెన్సీలు
x
Highlights

TSRTC cargo services:టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీసుల బుకింగ్స్‌ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్స్ చేసుకోవడానికి గాను ప్రత్యేక ఏజెన్సీలను నియమించాలని నిర్ణయించింది.

TSRTC cargo services: టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీసుల బుకింగ్స్‌ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్స్ చేసుకోవడానికి గాను ప్రత్యేక ఏజెన్సీలను నియమించాలని నిర్ణయించింది. మరొ పది రోజుల్లో ఇందుకు సంబంధిచిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. అంతకు ముందే ప్రత్యేకాధికారిని నియమించి విధివిధానాలను ఖరారుచేయనుంది. అర్హులైనవారికి ఏజెన్సీలు ఇచ్చి పార్శిల్‌ సర్వీసుల సేవలు కొనసాగించాలని యోచిస్తున్నది.

వస్తు రవాణా విలువలో కూడా కమీషన్‌ ఇవ్వనున్నది. అంతే కాదు ఏజెన్సీలకు బుకింగ్‌ మీద కొంత పర్సంటేజీని ఆర్టీసీ చెల్లించనున్నది. ఆర్టీసీ అధీకృత డీలర్ల ద్వారా టికెట్‌ బుక్‌చేసినట్టు కార్గో సర్వీసులను కూడా అప్పగించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సమీప డిపో మేనేజర్‌ పర్యవేక్షణలో ప్రతీ ఏజెన్సీ కొనసాగనున్నది. హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాలతోపాటు జిల్లాల్లో కూడా ఇదే విధానం అనుసరించనున్నారు.

నిజానికి ఎప్పటినుంచో ఆర్టీసీలో కార్గో సర్వీసులు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తూవస్తున్నారు. కొంతవరకూ పాక్షికంగా కార్గో రవాణా చేయటం మొదలు పెట్టారు కూడా. ఆయా బస్తాన్డుల్లోనే దీనికోసం ప్రత్యెక ఏర్పాట్లు చేసి కార్గో రవాణా చేసేవారు. అయితే, ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించుకుని, పూర్తి స్థాయిలో కార్గో రవాణా కూడా చేస్తే ఆర్టీసీకి లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతో ఇప్పుడు ఈ ఏర్పాట్లకు దిగారు. అర్హులైన వారికి ఏజెన్సీలు ఇవ్వడం ద్వారా ఇటు ఆర్టీసీకి, అతున్ నిరుద్యోగ యువతకు ఉభయతారకంగా లాభించే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories