సత్ఫలితాలను ఇస్తున్న టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు

సత్ఫలితాలను ఇస్తున్న టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు
x
Highlights

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో,...

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో, కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తుంది. కరోనా నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టికేటేతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి సాధించింది. ఇప్పటి వరకు బస్‌స్టాండ్ వరకే పరిమితమైన సేవలు త్వరలోనే హోం డెలివరి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు మంచి ఆదరణ వస్తోంది. దీంతో ఈ సేవలను మరింత విస్తరించాలని ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం కార్గో విస్తరణల్లో భాగంగా కల్లాల వద్ద కార్గో బస్సులు దర్శనమివ్వనున్నాయి. కల్లాల నుంచి ఇళ్లకు వరి ధాన్యం తరలించడానికి ఇది వరకు ఎడ్లబండ్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాల్లో కార్గో బస్సులు వచ్చాయి. ఫోన్‌ చేయగానే నేరుగా కల్లం వద్దకే కార్గో బస్సు వస్తోంది. ధాన్యం ఎత్తుకుని రైస్‌ మిల్లుకంటే మిల్లుకు, మార్కెట్‌ కంటే మార్కెట్‌కు తీసుకెళ్తోంది.

గతంలో కనీసం 300 కిలో మీటర్లు బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. పైగా అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీలూ భరించాల్సి ఉండేది. ఇప్పుడు 50 కిలోమీటర్ల పరిధిలో కూడా బుక్‌ చేసుకునే వీలు కల్పించారు. దీంతో పాటు కేవలం ఒకవైపు ఛార్జీ భరిస్తే సరిపోయేలా మార్చారు. 8 టన్నుల సామర్ధ్యం ఉండే బస్సు 50 కిలోమీటర్ల వరకు 4వేల 420 రూపాయలు, 75 కిలోమీటర్లకు 5వేల 010, 100 కిలో మీటర్లకు 5 వేల 600, 125 కిలోమీటర్లకు 6 వేల190 రూపాయలు ఇలా ఛార్జీలతో అందుబాటులో ఉన్నాయి సర్వీసులు.

పార్సిల్, కొరియర్ సేవలు హోం డేలివరీ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు ఇంఛార్జ్‌ కృష్ణకాంత్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు కూడా సేవలు విస్తృతం చేస్తున్నామన్నారు. మొత్తం147 బస్ స్టేషన్లలో సేవలు కొనసాగుతున్నాయని తెలంగాణ వంటకాలను వివిధ ప్రాంతాల నుండి ఆర్డర్ల ద్వారా సప్లై చేయడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ కామర్స్‌ను కూడా సంప్రదించామని త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

టికేటేతర ఆదాయంపై దృష్టి సాధించిన ఆర్టీసీకి ఉహించినదానికంటే ఆదాయం చేకూరుతుంది. కొరియర్ సేవలు ప్రారంభమైన మొదటిరోజు ఆదాయం 15వేలు కాగా ప్రస్తుతం ఒక రోజుకు 11 లక్షల ఆదాయం వస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో బస్సులు నడవడంతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమైతే మరింత ఆదాయం రాబట్టవచ్చని ఆర్టీసీ అధికారులు చేప్తున్నారు. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో భారీగా టికేటేతర ఆదాయం వస్తుండడంతో కార్గో, పార్సిల్, కొరియర్ పార్సిల్ సర్వీసులపై ఆర్టీసీ యాజమాన్యం మరింత దృష్టి సారించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories