TSRTC Bus Stops - Hyderabad: సమస్యల వలయంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు

TSRTC Bus Stops are Very Problematic in Hyderabad Secunderabad | Telugu Online News
x

సమస్యల వలయంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు

Highlights

TSRTC Bus Stops - Hyderabad: సికింద్రాబాద్ బస్ స్టాప్‌ల వద్ద ప్రయాణికుల ఇక్కట్లు...

TSRTC Bus Stops - Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణ ప్రాంగణాలు సమస్యల వలయంగా మారుతున్నాయి. నగరంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సునే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బస్ స్టేషన్‌లు.. షాపులు, చెరుకు బండ్లు, కొబ్బరి బొండాలు, కిల్లికొట్లకు నిలయంగా మారుతున్నాయి.

కొద్ది నెలల క్రితం నగరంలోని అన్ని బస్‌స్టాండ్ లను ఆధునీకరించారు. ఒక్కో బస్‌స్టాప్‌కి లక్షలు వెచ్చించి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం వీటి నిర్వహణ పట్టించుకోవడం లేదు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి గ్రేటర్ పరిధిలోని 29 డిపోల నుండి ఇక్కడికి బస్సులు వస్తాయి. అయితే బస్ స్టేషన్.. ప్రయాణికులకు అనుకూలంగా లేకుండా పోయింది. అక్రమంగా వెలసిన షాపులతో ప్రయాణికులకు కష్టాలు తప్పడంలేదు.

నారాయణగుడ, YMC చౌరస్తా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడ బస్ స్టేషన్ల వద్ద చెప్పుల షాపులు దర్శనం ఇస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అక్రమ షాపులు తొలగించి, బస్ స్టేషన్‌లలో అదనపు సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories