ఆరు దశాబ్దాల వెలుగులకు సెలవ్‌.. దశలవారిగా మూతపడనున్న కేటీపీఎస్‌ యూనిట్లు !

ఆరు దశాబ్దాల వెలుగులకు సెలవ్‌.. దశలవారిగా మూతపడనున్న కేటీపీఎస్‌ యూనిట్లు !
x
ఆరు దశాబ్దాల వెలుగులకు సెలవ్‌.. దశలవారిగా మూతపడనున్న కేటీపీఎస్‌ యూనిట్లు !
Highlights

దాదాపు ఆరు దశాబ్దాలుగా విద్యుత్‌ వెలుగులు పంచిన థర్మల్‌ పవర్‌ స్టేషన్‌మూసివేతకు రంగం సిద్ధమైంది. వెలుగు దివ్వెలను శాశ్వతంగా తొలగించి చరిత్రలో...

దాదాపు ఆరు దశాబ్దాలుగా విద్యుత్‌ వెలుగులు పంచిన థర్మల్‌ పవర్‌ స్టేషన్‌మూసివేతకు రంగం సిద్ధమైంది. వెలుగు దివ్వెలను శాశ్వతంగా తొలగించి చరిత్రలో కలిపేసేందుకు జెన్కో సిద్ధమవుతోంది. అధిక కాలుష్యం, ఉష్ణోగ్రతలు వెలువడుతున్న నేపథ్యంలో తొలగించేందుకు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇకపై ఈ కాంతిపుంజాలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుండగా భారీ పైలాన్లు కేటీపీఎస్‌కు జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1960లో పాల్వంచ ప్రాంతంలో కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో 240మెగావాట్ల సామర్థ్యంతో జపాన్‌ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో ఏ-యూనిట్‌ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. బీ యూనిట్‌ను 120 మెగావాట్ల సామర్థ్యంతో 1974లో రూ.51కోట్లతో, 3, 4యూనిట్లను 1977లో రూ.78 కోట్లతో నిర్మాణం చేశారు. అనంతరం 5వ దశ కేంద్రాలను రూ.2వేల కోట్లతో 250మెగావాట్ల సామర్థ్యంతో 1997లో సెమీ క్రిటికల్‌ ఫ్యాక్టరీ నిర్మించారు. 2011లో మళ్లీ 500మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించేందుకుగాను 6వ దశ యూనిట్‌ను ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సూపర్‌క్రిటికల్‌ కేంద్రంగా కేటీపీఎస్‌ 7వ దశను రూ.5,290 కోట్లతో సుమారు 800మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణం చేశారు. ఆ తర్వాత 8వది ప్రారంభించారు. అయితే ఇప్పుడు వాటి నుంచి అధిక కాలుష్యం, ఉష్ణోగ్రతలు వెలువడుతుండటంతో మూసేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

కేటీపీఎస్‌ యూనిట్లన్నింటిలో బొగ్గును మండించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటం వల్ల ప్రస్తుతం విపరీతమైన కాలుష్యం, అత్యధిక ఉష్ణోగ్రతలు వెలువడుతున్నాయి. దాంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పాల్వంచ కేటీపీఎస్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులైన నిపుణులతో సర్వే చేయించింది. అనంతరం కేటీపీఎస్‌ పాత ఎనిమిది యూనిట్లను దశలవారిగా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. వెలుగుపంచిన ప్రాజెక్ట్‌ మూతపడుతుండటంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేటీపీఎస్‌ పాతయూనిట్ల తొలగింపు అనంతరం కర్మాగారంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు, ఆర్టీజన్‌ల బదిలీలు తప్పనిసరైంది. అక్కడ పనిచేస్తున్న సుమారు 2500 మంది కార్మికులను ఒకే చోట సర్దుబాటు చేయటం సాధ్యంకాకపోవటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే మూసివేసిన యూనిట్లకు సంబందించిన సిబ్బందిని కేటీపీఎస్‌ ఏడోదశలో బర్తీచేయగా, కొందరిని మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (బీటీపీఎస్‌)కు బదిలీ చేశారు. కేటీపీఎస్‌ పాల్వంచలో విధులకు అలవాటు పడిన కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే బదిలీలపై జెన్‌కో ఒక కమిటీని వేయటంతో కార్మిక సంఘాల నేతలు కేటీపీఎస్‌ కార్మికులను స్థానికంగానే సర్దుబాటు చేయాలని కోరుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories