Telangana: ఆందోళన బాటలో జూనియర్ డాక్టర్స్

Telangana: ఆందోళన బాటలో జూనియర్ డాక్టర్స్
x

Telangana Junior Doctors:(The Hans India)

Highlights

Telangana: నాలుగు రోజుల నిరసన అనంతరం మే 26 నుండి నేరుగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Telangana: జూనియర్ డాక్టర్లు పట్టిన పట్టు వీడటం లేదు. డిమాండ్లు నెరవేర్చామన్నారు.. కాని ఎప్పటి నుంచో క్లారిటీ ఇవ్వలేదని.. అది వస్తేనే.. తాము నిరసన విరమిస్తామని తేల్చి చెబుతున్నారు. 26 నుంచి విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కరోనా సంక్షోభంలో అదే జరిగితే.. పరిణామాలు దారుణంగా ఉంటాయని అందరూ ఆందోళన చెందుతున్నారు.

తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే వైద్యాధికారులకు నోటీసులు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు కార్యాచరణను అమల్లో పెట్టనున్నారు. తమ డిమాండ్లలో భాగంగా రేపటి నుండి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇలా నాలుగు రోజుల నిరసన అనంతరం మే 26 నుండి నేరుగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. కాగా ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న జూడాలు ఆయా ఆసుపత్రులకు నోటీసులు అందజేశారు.రెండు వారాల్లోగా తమ డిమాండ్స్ నెరవేర్చక పోతే విధులను బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది.

జూనియర్ డాక్టర్స్ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం 15శాతం స్టైఫండ్‌ను పెంచడంతో పలు పలు ప్రోత్సహాకాలను సైతం ప్రకటించి నాలుగు రోజుల క్రితమే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే వాటిని ఎప్పటి నుండి అమలు చేస్తారని స్పష్టంగా చెప్పకపోవడంతో మరోసారి జూనియర్ డాక్టర్స్ నిరసనకు దిగనున్నారు. ముఖ్యంగా పెంచిన స్టైఫండ్ తోపాటు ప్రోత్సహాకాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

కాగా పెంచిన స్టైఫండ్ ప్రకారం మెడికల్, డెంటల్ హౌస్సర్జన్లకు నెలకు రూ.22,527, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ ఫస్టియర్ వారికి నెలకు రూ.50,686 స్టయిఫండ్ ఇస్తారు. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ సెకండియర్ వారికి రూ. 53,503… పీజీ డిగ్రీ, ఎండీఎస్ థర్డియర్ వారికి రూ.56,319 ఇస్తారు. సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి రూ. 56319, రెండో ఏడాది వారికి రూ.59135, మూడో సంవత్సరం వారికి రూ.61949 స్టైఫండ్ రానుంది.

హౌస్ స‌ర్జ‌న్ మెడిక‌ల్ కు గతంలో రూ.19,589 స్టైఫండ్ వ‌స్తుండ‌గా.. తాజా ఉత్వ‌ర్వుల‌తో వారికి రూ.22,527 స్టైఫండ్ రానుంది. హౌస్ స‌ర్జ‌న్ డెంట‌ల్ కు గ‌తంలో రూ.19,589 స్టైఫండ్ వ‌స్తుండ‌గా.. తాజా ఉత్తర్వుల‌తో వారికి రూ.22,527 స్టైఫండ్ రానుంది. కరోనా విపత్తును ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇప్పటికే 50 వేల తాత్కలిక ఉద్యోగులను కూడ తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఉద్యోగాల నియామానికి నోటిఫికేషన్ కూడ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జూడాలు రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచారు. దీంతో ప్రభుత్వం కూడ దిగివచ్చి వారి డిమాండ్స్ మేరకు స్పందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories