TS High Court: దళితబంధు పథకం పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేం

TS High Court Urgent Hearing Cannot be Held on the Dalita Bandhu Petition
x

తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

TS High Court: లిస్ట్‌ ప్రకారం విచారిస్తాం.. అప్పటివరకు ఆగాలి -కోర్టు * పైలెట్‌ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలంటూ పిటిషన్‌

TS High Court: దళిత బంధు పథకంపై దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. అత్యవసరంగా విచారణ చేపట్టలేమని, లిస్ట్‌ ప్రకారం విచారిస్తామని, అప్పటి వరకు ఆగాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదికి సూచించింది. దళితబంధు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్‌ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాయి. హుజూరాబాద్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకు తెలిపాయి. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీఎం కేసీఆర్‌ను చేర్చారు పిటిషనర్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories