Ts High Court: కరోనా కు అడ్డాగా మద్యం దుకాణాలు

Ts High Court Hearing on Corona Cases
x

Ts High Court:(photo tsch)

Highlights

Ts High Court: మద్యం దుకాణాలు కరోనా వనరులగా మారాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Ts High Court: రాష్ట్రంలో కరోనా విజృంభణకు మద్యం దుకాణాలే కారణమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా మార్గదర్శకాల అమలుపై హైకోర్టుకు డీజీపీ నివేదిక సమర్పించారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది. మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో రద్దీపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు కరోనా వనరులగా మారాయని ఈసందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.

సీరో సర్వైలెన్స్‌ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. సీరో పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్‌ లేకపోయినా.. కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఈనెల 14లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నివేదికలో వెల్లడించారు. సామాజిక దూరం పాటించని వారిపై 2,416 కేసులు, రోడ్లపై ఉమ్మి వేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని నివేదికలో వెల్లడించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16లక్షల మందికే జరిమానానా? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ ప్రాంతంలో రెండ్రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానిస్తూ విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories