Rythu Bharosa: రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక టెన్షన్ అవసరమే లేదు

Rythu Bharosa: రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక టెన్షన్ అవసరమే లేదు
x
Highlights

Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక నుంచి రైతులు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రైతు భరోసా స్కీం కింద...

Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక నుంచి రైతులు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రైతు భరోసా స్కీం కింద నిధులు మరో పదిరోజుల్లో అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ రైతు భరోసాకు కావాల్సిన డబ్బులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. మొత్తం 10కోట్ల రూపాయలను ప్రభుత్వం సిద్దం చేసింది. రైతు భరోసా తొలి విడతను అమలు చేయడానికి దాదాపు రూ. 6000 కోట్ల దాకా అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలు ఉండగా.. ఆ కుటుంబాలకు ఉన్న పొలాలకు అన్ని పాస్ పుస్తకాలు పత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాలకు ఏడాదికి ఎకరానికి రూ. 12,000 చొప్పున ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం ఒక విడత జనవరి 26న ఎకరానికి రూ. 6000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే.. అన్ని ఎకరాలకు డబ్బులు ఇవ్వనుంది. అయితే సాగుకి అనుకూలమైన భూములకు మాత్రమే డబ్బు ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

కాగా తెలంగాణలో మొత్తం 46 లక్షల కుటుంబాలకు భూమి లేదని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరిని రైతు కూలీలుగా లెక్కిస్తోంది ప్రభుత్వం. అందువల్ల వారందరికీ జాతీయ ఉపాధి హామీ కూలి గుర్తింపు కార్డు ప్రకారం కూలీలుగా గుర్తిస్తారు. వీరే కాకుండా ఈ కార్డు ఉన్నవారు మరో ఏడు లక్షల మంది దాకా ఉన్నారు. వీరందరికీ ఏడాదికి రూ. 12,000 చొప్పున ఇస్తామంటుంది ప్రభుత్వం. తొలి విడతగా జనవరి 26వ తేదీనరూ. 6000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. మరో రూ. 3,180 కోట్లు అవసరం ఉంటుంది. ఈ డబ్బును కూడా ప్రభుత్వం సిద్ధం చేసిందని సమాచారం.

ఇలా రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాల కింద మొత్తం 9,180 కోట్లు అవసరం అవుతుంది. ఇంకా అవసరమైనా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మొత్తం రూ.10వేల కోట్లను సిద్ధం చేసి పెట్టింది. ఆర్థిక శాఖ దగ్గర ఈ డబ్బు ఉందని సమాచారం.

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులకు కూలీల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాజాగా తెలిపారు. అంటే రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 6000 చొప్పున జమ చేయనున్నారు. అలాగే రైతు కూలీలకు రూ. 6000 రూపాయలు జమ చేస్తారు. ఇలా అందరూ అర్హుల అకౌంట్లో డబ్బులు జమ అవ్వడానికి మరో 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories