Telangana: ఈనెల 30 తరువాత ఏం జరగనుంది..?

TS Government Focused on Corona Second Wave Cases in Telangana State
x

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Highlights

Telangana: తెలంగాణ లో కరోనా విజృబిస్తున్న నేపథ్యంలో కట్టడి పై దృష్టి పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Telangana: తెలంగాణ లో కరోనా విజృబిస్తున్న నేపథ్యంలో కట్టడి పై దృష్టి పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 30 తరువాత నైట్ కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలా.. లేక లాక్ డౌన్ పెట్టాలన్న దానిపై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నైట్ కర్ఫ్యూ తో పాజిటివ్ కేసులు తగ్గడం లేదన్న అభిప్రాయం కి వచ్చిన ప్రభుత్వం. ఈ మేరకు చివరి అస్త్రంగా లాక్‌డౌన్ పై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

రేపు లేదా ఎల్లుండి సీఎం కేసీఆర్ ఉన్నతాస్థాయి సమీక్ష లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ తో కేసులు తగ్గే అవకాశం ఉందన్న ఆలోచన లో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కి అదే విషయం చెప్పాలని భావిస్తున్నారు అధికారులు. లాక్ డౌన్ ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల పరిస్థితి ని బట్టి అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడితే తెలంగాణ లో కూడా లాక్ డౌన్ పెట్టే ఆలోచన చేయడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఈ నెల 30 వ తరువాత ఏం జరగనుందో.. మరి కొద్ది గంటల్లో తెలియనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories