తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల
x
Highlights

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ క్యాంప‌స్‌లో విద్యాశాఖ మంత్రి సబితా...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ క్యాంప‌స్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు. మొత్తంగా పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 89,734 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. కరోనా వల్ల పరీక్షకు హాజరు కానీ అభ్యర్థులకు ఈనెల 8వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కాగా ఈసారి మొదటి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు.

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్ ర్యాంక్ సాధించిన వారి వివరాలు:

ఫస్ట్ ర్యాంక్ సాయి తేజ వారణాసి

సెకండ్ ర్యాంక్ యశ్వంత్ సాయి

థర్డ్ ర్యాంక్ తమ్మనబోయిన మణి వేంకట కృష్ణ

నాల్గో ర్యాంక్ చాగరి కౌశల్ కుమార్ రెడ్డి

ఐదో ర్యాంక్ అత్రిక్ రాజ్ పాల్ (జేఈఈ తొలి ర్యాంకర్ తెలంగాణ)

ఆరో ర్యాంక్ నాగెల్లి నితిన్ సాయి

ఏడో ర్యాంక్ ఈవీఎన్.వి.ఎస్. కృష్ణ కమల్

8వ ర్యాంక్ అన్నమ్ సాయి వర్ధన్

తొమ్మిదో ర్యాంక్ సాయి పవన్ హర్ష వర్ధన్

పదో ర్యాంక్ వారణాసి వచిన్ సిద్దార్థ్

Show Full Article
Print Article
Next Story
More Stories