TS EAMCET 2020: ఎంసెట్‌ పరీక్షల్లో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

TS EAMCET 2020: ఎంసెట్‌ పరీక్షల్లో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
x
Highlights

Ts Eamcet Exam 2020 : కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఎంసెట్ పరీక్షలు ఎట్టకేలకు ఈ నెల అంటే సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి ప్రారంభం...

Ts Eamcet Exam 2020 : కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఎంసెట్ పరీక్షలు ఎట్టకేలకు ఈ నెల అంటే సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మరో మూడు రోజుల్లోనే పరీక్షలు ప్రారంభం అవుతుండడంతో విద్యార్ధులు ఇప్పటికే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాయడానికి సన్నద్దం అవుతున్నారు. సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షల నిర్వహణకు ఎంసెట్‌ కమిటీ ఇప్పటికే 102 కేంద్రాలను ఏర్పాటు చేసారు. అయితే ఈ పరీక్షా కేంద్రాలు తెలంగాణలో 89 ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో 23 పరీక్షా కేంద్రాలను ఎంసెట్‌ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్‌లు తెచ్చుకోవాలని ఎంసెట్ కమిటీ సూచించింది.

అదే విధంగా వాటర్‌ బాటిల్‌, 50ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్ ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. వేలి ముద్రలు తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఫేస్‌ రికగ్నేషన్‌‌ సిస్టం విధానాన్ని ఫాలో కానుంది. పరీక్షా హాలులో విద్యార్ధులు అనుమతించడానికి ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి అనంతరం వారిని లోపలికి పంపిస్తామని తెలిపారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ లో కరోనా లక్షణాలు కనిపిస్తే విద్యార్దులను వెనక్కి పంపించి వేయాలని భావిస్తోంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు లేవని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చేలా విద్యార్థుల హాల్‌టికెట్లలోని నిబంధనల్లో పొందు పరిచింది.

ఇక పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్ధులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది ఎంసెట్ కమిటీ. సెంటర్లలో ఏవైనా సదుపాయాలు లేని పక్షంలో విద్యార్థులు ఎంసెట్‌ కమిటీ హెల్ప్‌డెస్క్‌కు తెలియజేసేలా చర్యలు చేపడుతోంది. పరీక్ష కేంద్రంలో ఉన్న వసతులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ పరీక్ష ఫలితాలను అక్టోబర్‌ మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

నిబంధనలు..

నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

ఉదయం 7:30 నుంచి, మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అనుమతించనున్నారు.

ప్రతి సెషన్‌లో విద్యార్థులను గంటర్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

పరీక్షకు వచ్చే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతోపాటు హాల్‌టికెట్, ఆధార్‌ వంటి ఏదేని ఒరిజినల్‌ ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలి.

విద్యార్థులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్‌ అధికారి/కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకం చేయించి, విద్యార్థులు తమ ఎడమచేతి వేలిముద్ర వేసి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని నిబంధనల్లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories