TS EAMCET 2020 : టీఎస్ ఎంసెట్ రిజిస్ట్రేషన్‌కి నేడే చివరి తేదీ

TS EAMCET 2020 : టీఎస్ ఎంసెట్ రిజిస్ట్రేషన్‌కి నేడే చివరి తేదీ
x
Highlights

TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ పొడిగించిన విషయం తెలిసిందే.

TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET)కి విద్యార్ధులు అప్లై చేసుకునే తేదీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. అయితే ఈ రోజే చివరి తేది కావడంతో ఎంసెట్ కు అప్లై చేసుకోని విద్యార్ధులు ఇప్పటికైనా అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో పరీక్ష రాసేందుకు అప్లై చేసుకోవచ్చు. ఇక చివరి రోజు కావడంతో విద్యార్ధులు లేటు ఫీజు కింద రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఇప్పటికే ఎంట్రెన్స్ రాసేందుకు అప్లై చేసుకున్న విద్యార్ధులు పరీక్షల కోసం హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 14 వరకూ టీఎస్ ఎంసెట్ 2020 జరగనున్నాయి. ఈ పరీక్షలను ప్రతి రోజు రెండు సెషన్లుగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ జరగనున్నాయి. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ నిర్వహించనున్నాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను అక్టోబర్ మూడో వారంలో విద్యార్థులకు ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ యూనివర్శిటీ (TSCHE) నిర్వహించనుంది.

ఎంసెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

విద్యార్ధులు ముందుగా eamcet.tsche.ac.in లోకి వెళ్లాలి.

డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.

గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చెయాలి.

వెంటనే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories