TS Dost 2020 : దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు జాబితా విడుదల

TS Dost 2020 : దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు జాబితా విడుదల
x
Highlights

TS Dost 2020 : ప్రతి ఏడాది వేసవి సెలవులు ముగియగానే ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు ఈ ఏడాది కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే...

TS Dost 2020 : ప్రతి ఏడాది వేసవి సెలవులు ముగియగానే ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు ఈ ఏడాది కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియను ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు చేప‌ట్ట‌ింది. దీంతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు దోస్త్ నోటిఫికేషన్ లో దరఖాస్తులు చేసుకన్నారు. కాగా తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను కేటాయించింది. రాష్ట్రంలో 1,71,275 మంది విద్యార్థులు దోస్త్‌లో నమోదు చేసుకున్నారని, వారలో 1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లను కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ను సెప్టెంబ‌రు 26 వరకు చేయాలని సూచించారు. రెండో విడతలో వెబ్‌ఆప్షన్లు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తర్వాత ఇవ్వొచ్చని తెలిపారు. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ 21 నుంచి కొనసాగుతుందని లింబాద్రి స్పష్టం చేశారు.

సీట్ల కేటాయింపు చెక్‌ చేసుకునే విధానం:

ముందుగా విద్యార్ధులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.

తరువాత హోమ్‌పేజీలోకి వెళ్లి ఫేజ్ 1 సీటు కేటాయింపు లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత విద్యార్ధుల దరఖాస్తు సంఖ్య, విశ్వవిద్యాలయ, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.

మీరు వివరాలను నమోదు చేసి, సీట్ల కేటాయింపు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories