తెలంగాణ ఎన్నికల పోలింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

TS Assembly Elections Live Updates
x

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

Highlights

TS Assembly Elections Live Updates: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అసద్

Assembly Elections Live Updates: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 33వ బూత్‌లో ఈవీఎంలు మొరయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగే కొయ్యలగూడెం 63వ బూత్‌లో సైతం ఈవీఎంలు మొరాయించాయి. దీంతో క్యూలో ఓటర్లు వేచి చూస్తున్నారు. అటు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని 282, 286 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో పోలింగ్ నిలిచిపోయింది.

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం రాంపూర్ తండాలోని పోలింగ్ బూత్ 211లో 6 ఓట్లు పోల్ అయిన తర్వాత ఈవీఎం మెషిన్ పనిచేయలేదు. దాంతో ఎన్నికల అధికారులు మరో ఈవీఎంను పెట్టారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు ఆగిపోయింది. అలాగే వికారాబాద్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొడంగల్‌లో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోగా... ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో ఓటు వేశారు. ఇటు ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయాల నాయకులు ఓటు వేశారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 70 వేల పోలీసులు తెలంగాణ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టభద్రత ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పోలీసు శాఖ తెలిపింది.


* కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి


*ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ ఉత్తమ్‌


*ఓల్డ్ సిటీలోని చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఓక్కరూ ఓటు ఓవైసీ తెలిపారు.


*ఓటు వేసిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌


*ఓటేసిన విజయశాంతి, వైఎస్‌ షర్మిల


*బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్‌


*ఓటు హక్కు వినియోగించుకున్న ధర్మపురి అరవింద్


*డీజీపీ అంజనీ కుమార్ సతీసమేతంగా ఓటు హక్కు వినియోగం


*బాన్సువాడలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నా పోచారం




Show Full Article
Print Article
Next Story
More Stories