టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ‌్య సవాళ్ల పర్వం

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ‌్య సవాళ్ల పర్వం
x

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ‌్య సవాళ్ల పర్వం

Highlights

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీని ప్రధానంగా అస్త్రంగా చేసుకుని అధికార పార్టీకి ప్రతిపక్షాలు చెక్‌...

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీని ప్రధానంగా అస్త్రంగా చేసుకుని అధికార పార్టీకి ప్రతిపక్షాలు చెక్‌ పెడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని విపక్షాలు పదే పదే ప్రచారం చేయడంతో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. లక్షా ముప్పై వేల పోస్టులు భర్తీ చేశామని ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. దీంతో తాము చర్చకు సిద్ధమని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిసవాల్‌ విసిరింది.

అటు అధికార పార్టీ , ఇటు ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లతో స్టేట్‌ పాలిటిక్స్‌లో హీట్‌ పెరిగింది. ప్రధానంగా ఉద్యోగాల భర్తీపై ఇవాళ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ‌్య బహిరంగ చర్చ జరగనుంది. ఎలాగైనా ఈ చర్చలోకి మంత్రి కేటీఆర్‌ను లాగాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాసేపట్లో అమరవీరుల స్థూపం వద్ద ఇరు పార్టీల మధ్య చర్చ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. గన్‌పార్క్‌ దగ్గరకు వెళ్లడానికి పార్టీ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌ నేత దాసోజ్‌ శ్రవణ్‌ రెడీ అయ్యారు. అంతేకాదు కేటీఆర్‌ కోసం ఎదురుచూస్తామని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్‌ వస్తే, టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు చెప్పి.. ఎన్ని భర్తీ చేసిందో ఆధారాలతో సహా చూపిస్తామంటోంది కాంగ్రెస్‌. ముఖ్యంగా అధికార పార్టీ చెబుతున్నవి అసత్యాలే అని నిరూపించే పనిలో బిజీ అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ. ఒకవేళ మంత్రి కేటీఆర్‌ చర్చకు రాకపోతే తామే పై చేయి సాధించామని చెప్పుకోనున్న కాంగ్రెస్‌ నిరుద్యోగులను మెప్పించాలనుకోటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories