MLC Elections: తక్కువలో తక్కువ రూ.10కోట్లు ఉంటేనే పని కాదా?

TRS Searches for Rich Candidates for MLC Elections
x

MLC Elections: తక్కువలో తక్కువ రూ.10కోట్లు ఉంటేనే పని కాదా?

Highlights

MLC Elections: మరో నెలన్నర గడవు ఉండగానే ఉన్నఫళంగా మండలి నోటిఫికేషన్ ఎందుకొచ్చింది?

MLC Elections: మరో నెలన్నర గడవు ఉండగానే ఉన్నఫళంగా మండలి నోటిఫికేషన్ ఎందుకొచ్చింది? హుజురాబాద్ నుంచి పార్టీలు తేరుకోకముందే గుక్క తిప్పుకోకుండా ఎందుకు మీదపడింది ఎలా మీద పడింది. మరి, ఆ స్థానాలకు రెడీగా డబ్బులు పెట్టే స్థోమత ఉన్న అభ్యర్థులు ఎందరు? స్థానిక సంస్థల కోటా కాబట్టి ఓటర్లకు డబ్బులిచ్చేది ఎవరు? ఆ ఖర్చుల భారం మోసేది ఎవరు? టీఆర్ఎస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ మండలి స్థానాల్లో పోటీకీ రెడీ ఉన్నా ఖర్చులో పోటీ పడే వారెవ్వరు?

స్థానిక సంస్థల కోటా కింద విడుదలైన నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రసమితిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే హుజురాబాద్‌లో తడిసి మోపేడైన భారం నుంచి కోలుకోకముందే, మండలి ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. పార్టీ పరంగా కాకుండా ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎవరన్న లెక్కలు తీస్తోంది టీఆర్ఎస్‌. 12 స్థానిక సంస్థల కోటా స్థానాల్లో వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్న వరికోలు శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈసారి పోటీలో ఉన్నారు. నోటిఫికేషన్ అలా వెలువడగానే పార్టీ నుండి శ్రీనూ బీ రెడీ అండ్ గో టు ఫీల్డ్ అని ఫీడర్స్ ఇచ్చేసిందట.

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శ్రీనివాస్‌రెడ్డి హుటాహుటినా వరంగల్ బయల్దేరి వెళ్లారట. పోటీ సరే డబ్బులెలా అనే ఫీలింగ్ ఉన్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో ఉండాలంటే కనీసానికి పది కోట్లు కావాలట. జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు ఉంటారు. గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు ఓటు కింద ఎంతో కొంత డబ్బు ఇవ్వాలన్నది ఓపెన్ సీక్రెట్. కనీసం ఈసారి ఒక ఓటుకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు ధర పలికే అవకాశం ఉందన్న ప్రచారాల మధ్య వరంగల్ విషయంలో పోచంపల్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఇక నల్లగొండ జిల్లా విషయానికొస్తే డబ్బులు పెట్టుకునే అభ్యర్థి ఎవరబ్బా అనే లెక్కలు పార్టీ మొదలుపెట్టిందట. ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. ఆర్థికంగా చిన్నారెడ్డి బలంగానే ఉన్నా అక్కడ పోటీ పడే ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అయితే కోటిరెడ్డికి గతంలో సీఎం హామీ ఉంది కాబట్టి ఆయనకే మొగ్గు చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్‌కు పోటీగా మరో ఇద్దరు నేతలు డబ్బులతో రెడీ ఉన్నారట. నిజామాబాద్ జిల్లా నుంచి సిట్టింగ్ ఉన్న కల్వకుంట్ల కవిత ఈసారి స్థానిక సంస్థల కోటాలో పోటీకి అయిష్టంగా ఉన్నారట. ఆమె ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేయాలని భావిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే ఆ జిల్లా నుంచి మండవ వెంకటేశ్వర్‌రావు, అరికెల నర్సారెడ్డిలు పోటీ పడుతున్నారట. మెదక్ జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేరే వినవస్తోంది.

ఇటు ఖమ్మం జిల్లా నుంచి అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ బాలసాని లక్ష్మీనారాయణకు పోటీగా తుమ్మల నాగేశ్వర్‌రావు గాని లేక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గానీ బరిలో దింపే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు పార్టీ పరంగా ఆర్థికంగా సహకారం అందిస్తే వారికి అవకాశం లభిస్తుందన్న చర్చ సాగుతోంది. రంగారెడ్డి నుంచి ఉన్న రెండు స్థానాల్లో శంబీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డిలకు మళ్లీ రెన్యూవల్ ఉంటుందా లేక ప్రత్యామ్నాయం కోసం చూసే అవకాశం ఉందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. పాలమూరు జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుంట్ల దామోదర్‌రెడ్డిలు ఉన్నా వీరిలో ఒకరు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అవకాశం ఇవ్వొచ్చని చెబుతున్నారు.

అయితే, ఒక్కసారిగా ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక సంస్థల కోటాలో వరుసగా నోటిఫికేషన్లు వెలువడతుండండతో పార్టీలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. అనుహ్యంగా స్థానిక సంస్థల కోటాకు కూడా షెడ్యూల్ ఖరారవడంతో స్థానాలు, అభ్యర్థుల సర్ధుబాట్లపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories